లోకల్‌ ఫార్మర్స్‌కి ఊతమిస్తోన్న ముహర్రాక్‌ ఫార్మర్స్‌ మార్కెట్‌

- December 19, 2019 , by Maagulf
లోకల్‌ ఫార్మర్స్‌కి ఊతమిస్తోన్న ముహర్రాక్‌ ఫార్మర్స్‌ మార్కెట్‌

బహ్రెయిన్‌:ముహర్రాక్‌లోని ఒయాసిస్‌ మాల్‌లో ఫార్మర్స్‌ మార్కెట్‌ని నేషనల్‌ ఇనీషియేటివ్‌ ఫర్‌ అగ్రికల్చరల్‌ డెవలప్‌మెంట్‌ సెక్రెటరీ జనరల్‌ షేకా మారమ్‌ బింట్‌ ఇసా బిన్‌ అహ్మద్‌ అల్‌ ఖలీఫా ప్రారంభించారు. నాలుగు నెలలపాటు ఈ మార్కెట్‌ కొనసాగుతుంది. స్థానిక ఫార్మర్స్‌కి ఊతమిచ్చేలా ఈ మార్కెట్‌ని ఏర్పాటు చేశారు. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 నిమిషాల వరకు ఈ మార్కెట్‌ వుంటుంది. మార్చి 27తో మార్కెట్‌ ముగుస్తుంది. ఫార్మర్స్‌ మార్కెట్‌లో మొత్తం 15 మంది వెండర్స్‌ తాజా వెజిటబుల్స్‌, ఫ్రూట్స్‌, స్థానిక స్పెసీస్‌ని విక్రయిస్తారు. ఈ మార్కెట్‌లో తాజా బహ్రెయినీ బ్రేక్‌ ఫాస్ట్‌ని కూడా విక్రయించనున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com