క్యుఐబి - ఖతార్‌ నేషనల్‌ డే సెలబ్రేషన్స్‌

- December 19, 2019 , by Maagulf
క్యుఐబి - ఖతార్‌ నేషనల్‌ డే సెలబ్రేషన్స్‌

దోహా: ఖతార్‌ ఇస్లామిక్‌ బ్యాంక్‌, ఖతార్‌ నేషనల్‌ డే (క్యుఎన్‌డి) సెలబ్రేషన్స్‌ని నిర్వహించింది. ఈ వేడుకలకు క్యుఐబి తమ ఉద్యోగులందర్నీ ఒకే వేదికపైకి తీసుకొచ్చింది. గ్రాండ్‌ హమాద్‌ స్ట్రీట్‌లోని హెడ్‌ క్వార్టర్స్‌లో ఈ వేడుకలు జరిగాయి. బ్యాంక్‌ ఎగ్జిక్యూటివ్‌ మేనేజ్‌మెంట్‌ ఈ ఈవెంట్‌కి హాజరయ్యింది. క్యుఐబి బ్యాంక్‌ వైడ్‌ ఫొటోగ్రఫీని కూడా ఈ వేడుకల్లో నిర్వహించడం జరిగింది. ఈ పోటీల్లో విజేతల్ని ఎంపిక చేసి బహుమతులు అందించారు. ఛైర్మన్‌ షేక్‌ జాస్సిమ్‌ బిన్‌ హమాద్‌ బిన్‌ జస్సిమ్‌ బిన్‌ జబెర్‌ అల్‌ థని మాట్లాడుతూ, ఖతార్‌ నేసనల్‌ డే అనేది దేశంలోని ప్రతి ఒక్కరికీ చాలా ప్రత్యేకమైన రోజని అన్నారు. ఈ వేడుకల్ని నిర్వహించడం గర్వంగా వుందని చెప్పారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com