బహ్రెయిన్‌లో ప్రముఖ రోడ్లపై లేన్ క్లోజర్స్
- December 20, 2019
బహ్రెయిన్‌లోని పలు ప్రముఖ రోడ్లపై లేన్ క్లోజర్స్‌ని ప్రకటించారు. జనాబియా హైవే (జనాబియా ఫ్లై ఓవర్)పై సౌత్ బౌండ్ ట్రాఫిక్‌కి సంబంధించి లెఫ్ట్ లేన్ని ఎలక్ట్రికల్ కేబుల్స్ ఇన్స్టలేషన్ నేపథ్యంలో మూసివేస్తున్నట్లు మినిస్ట్రీ ఆఫ్ వర్క్స్ వెల్లడించింది. ఆదివారం ఉదయం వరకు ఈ మూసివేత అమల్లో వుంటుంది. ఒక లేన్ని ట్రాఫిక్ మూవ్మెంట్ కోసం తెరచి వుంచుతారు. కాగా, ఖలీఫా బిన్ సల్మాన్ హైవేపై హమాద్ టౌన్ వైపుగా వెళ్ళే ఒకటి మరియు రెండు లేన్లను మూసివేస్తారు. నెల రోజులపాటు రెండు స్టేజిల్లో ఈ మూసివేత అమల్లో వుంటుంది. రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు వారాంతాల్లో మినహాయించి మిగతా రోజుల్లో మూసివేత అమల్లో వుంటుంది. శుక్రవారాల్లో రాత్రి 12 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఈ మూసివేతని అమలు చేస్తారు. మరోపక్క షేక్ సల్మాన్ హైవేపై ఇసా టౌన్ వద్ద నార్త్ బౌండ్ ట్రాఫిక్‌కి సంబంధించి స్లో లేన్ని మూసివేస్తారు. నేటి రాత్రి 11 గంటల నుంచి రేపు ఉదయం 5 గంటల వరకు ఈ మూసివేతను అమల్లో వుంచుతారు.
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్‌లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?