ముషారఫ్ మృతదేహాన్ని మూడురోజులు ఉరితాడుకు వేలాడదీయాలి: పాక్ న్యాయమూర్తి
- December 20, 2019
పాక్ మాజీ అధ్యక్షుడు ముషారప్‌కు మరణశిక్ష అమలుపై ఆ దేశ ప్రత్యేక కోర్టు.. కీలక వాఖ్యలు చేసింది. ఒక వేళ మరణశిక్ష అమలు చేయడానికి ముందే ముషారఫ్ చనిపోతే.. ఆయన మృతదేహాన్ని ఇస్లామాబాద్‌లోని సెంట్రల్ స్క్వేర్‌కు ఈడ్చుకొచ్చి.. మూడ్రోజులు పాటు ఉరితాడుకు వేలాడతీయాలని వ్యాఖ్యానించింది. అధికారంలో ఉండగా.. రాజ్యాంగాన్ని సస్పెండ్ చేయడం, ఎమెర్జెన్సీ విధించడం ద్వారా ముషారఫ్ దేశద్రోహానికి పాల్పడ్డారని త్రిసభ్య ధర్మాసనం ఉరిశిక్ష విధించింది. పెషావర్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ వకార్ అహ్మద్ సేథ్ రాసిన 167 పేజీల తీర్పు కాపీ బయటికి వచ్చింది.
ఈ తీర్పు కాపీలో చీఫ్ జస్టిస్ వకార్ అహ్మద్ సేథ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పరారీలో ఉన్న ముషారప్‌ను పట్టుకోవడానికి శక్తివంచన లేకుండా ప్రయత్నించాలని అధికారులను ఆదేశించారాయన. ఒకవేళ ముషారఫ్ సజీవంగా దొరక్కపోతే.. ఆయన మృతదేహాన్ని ఇస్లామాబాద్‌లోని డీ చౌక్‌కు ఈడ్చుకు రావాలని తీర్పు కాపీలో పేర్కొన్నారు. అనంతరం మూడ్రోజుల పాటు ఉరితాడుకు వేలాడదీయాలంటూ.. అందులో రాశారు. న్యాయమూర్తి చేసిన ఈ వ్యాఖ్యలపై సైన్యం ఆగ్రహం వ్యక్తం చేసింది.
తాజా వార్తలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్‌లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్‌లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..







