ఉమ్ అల్ కువైన్:ఇండస్ట్రీయర్ ఎస్టేట్ లో ఫైర్ యాక్సిడెంట్, 90 మంది ఆసియా కార్మికులు సేఫ్
- December 21, 2019
ఉమ్ అల్ కువైన్ లోని ఉమ్ అల్ తౌబ్ ఇండస్ట్రియల్ ఎస్టేట్ లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. గురువారం తెల్లవారుజామున వార్ హౌజ్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఫైర్ యాక్సిడెంట్ జరిగిన సమయంలో అక్కడ 90 మంది ఆసియా కార్మికులు ఉన్నారు. అయితే వారందరు ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డారు.
తెల్లవారుజామున 3 గంటల సమయంలో ప్రమాదం విషయాన్ని కార్మికులు ఫోన్ చేసి తమకు సమాచారం అందించారని సివిల్ డిఫెన్స్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ సలెమ్ హమద్ బిన్ హమ్దా వెల్లడించారు. వెంటనే ఫైర్ ఫైటర్స్ ను సంఘటన స్థలానికి పంపించి సహాయక చర్యలు చేపట్టామని, కార్మికులను అక్కడి నుంచి తరలించామని ఆయన తెలిపారు. ప్రమాదంలో కార్మికులు అందరూ సేఫ్ గా బయటపడినా..వార్ హౌజ్ (గోడౌన్) మాత్రం పూర్తిగా కాలిపోయింది. అగ్నిప్రమాదానికి కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
తాజా వార్తలు
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్‌లో అస్సాం రైఫిల్స్‌పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!