ఢిల్లీ లో అగ్ని ప్రమాదం..
- December 23, 2019
ఢిల్లీ లోని కిరారి ప్రాంతంలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఓ వస్త్ర గోదాంలో సోమవారం వేకువజామున భారీ స్థాయిలో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో కనీసం తొమ్మిది మంది మృతి చెందారు. మరో 10మంది తీవ్రంగా గాయపడ్డారు.
క్షతగాత్రుల్ని చికిత్స నిమిత్తం సంజయ్ గాంధీ మెమోరియల్ ఆస్పత్రికి తరలించారు. అర్ధరాత్రి 12.30గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మంటల్ని అదుపులోకి తీసుకొచ్చారు. కేసు నమోదు చేసిన పోలీసులు ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు ప్రారంభించారు.
డిసెంబర్ 8న అనాజ్‌మండీ ప్రాంతంలోని ఓ కర్మాగారంలో జరిగిన అగ్ని ప్రమాదంలో 43 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. మృతుల కుటుంబాలకు ఢిల్లీ ప్రభుత్వం రూ.2లక్షలు, కేంద్ర రూ.10లక్షలు ఆర్థిక సాయం ప్రకటించింది. ఈ ఘటన మరువక ముందే మరో భారీ ప్రమాదం సంభవించడం ప్రాధాన్యం సంతరించుకుంది.
తాజా వార్తలు
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!







