బరువు తగ్గాలంటే..
- December 23, 2019
నిమ్మరసాన్ని గోరువెచ్చని నీటిలో కలుపుకుని తాగితే సులభంగా బరువు తగ్గుతారని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. నిమ్మకాయలోని పెక్టిన్ అనే ప్రత్యేక ఫైబర్ బరువును సులభంగా తగ్గిస్తుంది. దీంతో మెటబాలిజం మెరుగ.
నిమ్మరసాన్ని గోరువెచ్చని నీటిలో కలుపుకుని తాగితే సులభంగా బరువు తగ్గుతారని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. నిమ్మకాయలోని పెక్టిన్ అనే ప్రత్యేక ఫైబర్ బరువును సులభంగా తగ్గిస్తుంది. దీంతో మెటబాలిజం మెరుగుపడి ఆకలిని నియంత్రించి బరువు తగ్గేలా చేస్తుంది. పొద్దున్నే ఒక గ్లాస్ నిమ్మరసం తాగితే జీర్ణక్రియ మెరుగ్గా వుంటుంది.
రోజు వారిగా నిమ్మరసం తాగితే కాలేయానికి టానిక్‌గా పనిచేసి, పైత్యరసాల ఉత్పత్తి పెరుగుతుంది. నిమ్మరసంలోని విటమిన్ సి వల్ల రోగనిరోధక వ్యవస్థ మెరుగై, పలురకాల అంటురోగాల నుంచి బయటపడవచ్చు. గొంతునొప్పి, ఆస్తా ఇబ్బందుల నుంచి ఉపశమనం ఇచ్చే గుణం నిమ్మకుంది. నిమ్మకాయ రసం నీటిలో లేదా మజ్జిగలో పిండుకుని తాగటం ద్వారా జీర్ణక్రియ మెరుగుపడుతుంది.
గోరువెచ్చని నీటిలో నిమ్మరసం పిండి తాగితే ఇన్ఫెక్షన్లతో పోరాడగలిగే ఇమ్యూనిటీ పెరుగుతుంది. నిమ్మలోని సిట్రిక్‌యాసిడ్‌తో జీర్ణశక్తి చురుకవుతుంది. పంటినొప్పికి చక్కటి విరుగుడుగా నిమ్మరసం పనిచేస్తుంది. అలాగే క్యాన్సర్ కారకాలను నియంత్రిస్తుంది. నేత్ర సమస్యలను నివారిస్తుంది. రక్తాన్ని శుద్ధి చేస్తుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
తాజా వార్తలు
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్‌లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్‌లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!







