ఖతార్: ఫారెన్ ఇన్వెస్టర్లకు రెసిడెన్సీ స్కీం

- December 24, 2019 , by Maagulf
ఖతార్: ఫారెన్ ఇన్వెస్టర్లకు రెసిడెన్సీ స్కీం

దోహా:ఫారెన్ ఇన్వెస్టర్లను ఆకర్షించేందుకు ఇప్పటికే పలు చర్యలు తీసుకున్న ఖతార్ ప్రభుత్వం..తాజాగా మరో ప్రొత్సాహక నిర్ణయాన్ని ప్రకటించింది. ఇన్వెస్టర్లకు రెసిడెన్సీ సౌకర్యం కల్పించనున్నట్లు ప్రకటించింది. అయితే..ఖతార్ లో కాకుండా దేశంలోని ఇతర ప్రాంతాల్లో పెట్టుబడులు పెట్టే వారికే ఈ కొత్త స్కీం వర్తిస్తుంది. అభివృద్ధి వికేంద్రీకరణలో భాగంగా ఈ పథకాన్ని అమలులోకి తీసుకొచ్చారు. విదేశీ ఇన్వెస్టర్లు ఎక్కువగా ఖతార్ వరకే పరిమితం అవుతుండటంతో..దేశంలోని మిగిలిన ప్రాంతాల్లోనూ పెట్టుబడులను ప్రొత్సహించాలన్నదే ఈ స్కీం లక్ష్యం. ఖతార్ ప్రాపర్టీ మార్కెట్ లో యాక్టీవ్ గా ఉన్న రియల్ ఎస్టేట్ డెవలపర్స్ కి కూడా ఈ స్కీం వర్తిస్తుంది. గతంలో ఖతార్ లో పెట్టుబడులు పెట్టే వారికి మాత్రమే రెసిడెన్సీ అవకాశం ఉండేది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com