కువైట్:సబ్ స్టేషన్ లో ఫైర్ యాక్సిడెంట్, ఎయిర్ పోర్టుతో సహా పలు ప్రాంతాలకు పవర్ కట్
- December 24, 2019
కువైట్:ఒమరియా పవర్ స్టేషన్ లో మెయిన్ ట్రాన్స్ ఫర్ లో ఫైర్ యాక్సిడెంట్ సంభవించింది. దీంతో కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ తో పాటు చుట్టుపక్కల ప్రాంతాలకు పవర్ సరఫరా నిలిచిపోయింది. అగ్నిప్రమాద సమాచారం అందుకున్న మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అండ్ వాటర్ డిపార్ట్ మెంట్ ముందుజాగ్రత్తగా వెంటనే పవర్ సప్లై నిలిపివేసింది. అగ్నిమాపక సిబ్బంది వెంటనే మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ప్రమాదానికి గల కారణాలపై ఎంక్వైరీ చేసేందుకు ప్యానెల్ ఏర్పాటు చేశారు. ఈ అగ్నిప్రమాదంతో కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టుతో పాటు..రెహాబ్, రాబియా, ఇష్బిలియా, ఆర్దియా, రిగ్గే, ఫర్వానియా, ఒమారియా, జ్లీబ్, అల్-షుయౌఖ్ ప్రాంతాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఇండస్ట్రీయల్ ఏరియా షువైక్ పై పవర్ సప్లై ఆపేశారు. అయితే..అరగంటలోనే అంతా సెట్ చేసి పవర్ సప్లై మళ్లీ స్టార్ట్ చేశారు.
తాజా వార్తలు
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు
- టీటీడీకి రూ.10 లక్షలు విరాళం
- ఛార్జీల సవరణ ‘దసరా స్పెషల్స్’లోనే స్పష్టం
- దుబాయ్ లో నకిలీ హోటల్ ఫ్లోర్ లీజు..ఇద్దరికి జైలు శిక్ష..!!
- అల్-ముత్లా యాక్సిడెండ్, ఎమర్జెన్సీ సెంటర్ ప్రారంభం..!!
- మహిళకు జీవిత ఖైదు విధించిన బహ్రెయిన్ కోర్టు..!!
- 10 కిలోల మెత్ సీజ్ చేసిన సౌదీ కస్టమ్స్..!!
- ఒమన్‌లో ఐఫోన్ 17 సందడి..!!
- దోహాలో AGCFF U-17 గల్ఫ్ కప్ ప్రారంభోత్సవం..!!
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..