ప్రవాసి మిత్ర గొల్లపల్లి మండల కార్యవర్గం నియామకం

- December 24, 2019 , by Maagulf
ప్రవాసి మిత్ర గొల్లపల్లి మండల కార్యవర్గం నియామకం

తెలంగాణ:ప్రవాసి మిత్ర లేబర్ యూనియన్ గొల్లపల్లి మండల కన్వీనర్ గా మ్యాడవరపు నాగభూషణం, మండల వలంటీర్ గా సయిండ్ల దామోదర్ ను నియమిస్తూ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు స్వదేశ్ పరికిపండ్ల మంగళవారం జగిత్యాలలో నియామక పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్ ప్రధాన కార్యదర్శి సయిండ్ల రాజిరెడ్డి పాల్గొన్నారు. 

వలస కార్మికుల హక్కులు, సంక్షేమం పట్ల వీరికి ఉన్న నిబద్దత, ప్రవాసి మిత్ర లేబర్ యూనియన్ లో క్రియాశీలకంగా పని చేయాలనే ఆసక్తి, నాయకత్వ లక్షణాలను గుర్తించి ఈ నియామకాలు చేపట్టినట్లు స్వదేశ్ తెలిపారు. 

ప్రజలు బ్రతుకుదెరువు కోసం, ఉద్యోగం, ఉపాధి కోసం  అంతర్గత వలసలు,  అంతర్జాతీయ వలసలు  వెళుతుంటారు. సురక్షితమైన, చట్టబద్దమైన వలసల కోసం ప్రవాసి మిత్ర లేబర్ యూనియన్ నిర్వహించే అవగాహన, చైతన్య కార్యక్రమాలను విజయవంతం చేయాలని ఈ సందర్బంగా స్వదేశ్ అన్నారు

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com