యూఏఈలో గ్రాండ్ గా క్రిస్మస్ సెలబ్రేషన్స్

- December 26, 2019 , by Maagulf
యూఏఈలో గ్రాండ్ గా క్రిస్మస్ సెలబ్రేషన్స్

యూఏఈలో క్రిస్మస్ సెలబ్రేషన్స్ ని భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. వేలాదిగా తరలొచ్చిన భక్తులతో అబుదాబి, దుబాయ్, షార్జాలోని చర్చిలు కళకళలాడాయి. ఉదయం నాలుగు గంటల నుంచే ప్రత్యేక ప్రార్ధనలు ప్రారంభమయ్యాయి. రాత్రి 8.30 గంటల వరకు గ్రాండ్ మాస్ కొనసాగింది. అబుదాబిలోని సెయింట్ జోసఫ్ కేథడ్రల్ చర్చికి తెల్లవారుజాము నుంచే భక్తుల భారీ సంఖ్యలో తరలొచ్చారు. ఇంగ్లీష్, అరబిక్, మలయాళం, తమిళం, సింహళ, స్పానిష్, కొంకణి, కొరియన్, పోలిష్, ఇటాలియన్, ఉర్దూ లాంగ్వేజస్ లో ప్రేయర్ చేయటం విశేషం. క్రిస్మస్ సెలబ్రేషన్స్ ని గ్రాండ్ గా నిర్వహించుకునే అవకాశం కల్పించిన యూఏఈ ప్రభుత్వంపై ప్రశంసలు కురిపించారు. అయితే..పండగ పూట కుటుంబసభ్యులకు దూరంగా ఉండాల్సి రావటం లోటుగా ఫీలయ్యారు భక్తులు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com