మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టుల్ని హతమార్చిన సెక్యూరిటీ ఫోర్సెస్
- December 26, 2019
రియాద్: సౌదీ సెక్యూరిటీ ఫోర్సెస్ ఇద్దరు మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టుల్ని హతమార్చింది. దమ్మామ్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. తీవ్రవాదులు వుంటోన్న ప్రాంతంలో సౌదీ ఫోర్సెస్ తనిఖీలు నిర్వహించగా, తీవ్రవాదులు కాల్పులు జరిపారనీ, సెక్యూరిటీ ఫోర్సెస్ ఎదురు కాల్పులు ప్రారంభించడంతో తీవ్రవాదులు ప్రాణాలు కోల్పోయారనీ అధికారిక వర్గాలు వెల్లడించాయి. ఘటన అనంతరం సెక్యూరిటీ ఫోర్సెస్ ఆ ప్రాంతాన్ని జల్లెడ పట్టాయి. లొంగిపోవాల్సిందిగా ఆదేశించినా తీవ్రవాదులు పట్టించుకోకుండా దాడికి దిగడంతోనే వారిని హతమార్చాల్సి వచ్చిందని సెక్యూరిటీ ఫోర్సెస్ ప్రతినిథులు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- దుబాయ్ లో నకిలీ హోటల్ ఫ్లోర్ లీజు..ఇద్దరికి జైలు శిక్ష..!!
- అల్-ముత్లా యాక్సిడెండ్, ఎమర్జెన్సీ సెంటర్ ప్రారంభం..!!
- మహిళకు జీవిత ఖైదు విధించిన బహ్రెయిన్ కోర్టు..!!
- 10 కిలోల మెత్ సీజ్ చేసిన సౌదీ కస్టమ్స్..!!
- ఒమన్‌లో ఐఫోన్ 17 సందడి..!!
- దోహాలో AGCFF U-17 గల్ఫ్ కప్ ప్రారంభోత్సవం..!!
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..