కజకిస్తాన్‌లో విమాన ప్రమాదం...
- December 27, 2019
100 మందితో ప్రయాణిస్తున్న ఓ విమానం కజకిస్తాన్‌లో కూలిపోయిందని విమానాశ్రయ అధికారులు తెలిపారు.అల్మాటీ ఎయిర్‌పోర్ట్ నుంచి స్థానిక కాలమానం ప్రకారం శుక్రవారం ఉదయం టేక్ ఆఫ్ అయిన బెక్ ఎయిర్ క్రాఫ్ట్ కాసేపటికే కూలిపోయింది.
అత్యవసర సహాయ సిబ్బంది ప్రమాదం జరిగిన స్థలానికి చేరుకున్నారు. ఇప్పటి వరకూ ఏడుగురు మరణించినట్లు ధృవీకరించారు. గాయపడినవారిని, ఇతరులను శిథిలాల నుంచి రక్షిస్తున్నారని అధికారులు తెలిపారు.ఈ విమానం కజకిస్తాన్‌లోని అతి పెద్ద నగరం అల్మాటీ నుంచి దేశ రాజధాని నూర్-సుల్తాన్ నగరానికి వెళ్తోంది.
ప్రమాదం జరిగినప్పుడు విమానంలో 95 మంది ప్రయాణికులు, ఐదుగురు సిబ్బంది ఉన్నారని అల్మాటీ ఎయిర్ పోర్ట్ తెలిపింది.స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 7.22 గంటలకు ఈ ప్రమాదం జరిగింది. కిందికి దిగిపోయిన విమానం ఓ కాంక్రీట్ గోడను గుద్దుకుని, ఓ రెండస్థుల భవనాన్ని ఓ వైపు ఢీకొట్టింది. విమానం కూలిన తర్వాత మంటలు చెలరేగలేదు.
సహాయక సిబ్బంది గాయపడినవారిని రక్షిస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో కనిపించాయి. వాటిలో... ఆంబులెన్స్ కోసం అరుస్తున్న ఓ మహిళ, ఓ భవనంలోకి దూసుకెళ్లిన విమానం కాక్‌పిట్ కనిపిస్తున్నాయి.ప్రమాదానికి కారణాలను నిర్థరించడానికి ప్రత్యేక కమిషన్ ఏర్పాటైంది.ప్రమాదంపై దేశ అధ్యక్షుడు ఖాసిమ్-జొమార్ట్ తొకయేవ్ విచారం వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్‌లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు