చెన్నై, ముంబై,నాగపూర్ తెలుగువారికి కేసీఆర్ గుడ్ న్యూస్!
- December 27, 2019
తెలంగాణ:చెన్నై, ముంబై, నాగపూర్‌లో నివసిస్తున్న తెలుగువారికి తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్ కీలక గుడ్ న్యూస్ చెప్పారు. తెలంగాణకు పొరుగున ఉన్న మహారాష్ట్ర రాజధాని ముంబై, ఆంధ్రప్రదేశ్ పక్క రాష్ట్రమైన తమిళనాడు రాజధాని చెన్నైలోని తెలుగువారికి తాజాగా తెలంగాణ సీఎం కేసీఆర్ ఈ గుడ్ న్యూస్ వినిపించారు.
హైదరాబాద్‌లోని వివిధ డిపోల నుంచి నేరుగా చెన్నై,ముంబై,నాగపూర్ తదితర ప్రాంతాలకు వెళ్లే బస్సు సర్వీసుల సంఖ్యను పెంచాలని సీఎం కేసీఆర్ సూచించారు. ప్రయాణికుల అవసరాలకు తగినట్లుగా ఈ రవాణ సదుపాయాలు ఉండాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆర్టీసీ అధికారులకు స్పష్టం చేశారు.
తెలంగాణ ఆర్టీసీపై ప్రగతి భవన్‌లో బుధవారం సీఎం కేసీఆర్ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కె.జోషి, ఆర్టీసీ ఎండి సునిల్ శర్మ, ఇడిలు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆర్టీసీని కాపాడడానికి, లాభాల బాట పట్టించేందుకు, ఉద్యోగుల సంక్షేమానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరిస్తూ, ఉద్యోగులు కూడా తగిన స్పూర్తితో, చిత్తశుద్ధితో తమ బాధ్యతలు నిర్వర్తించేలా చూడాలని అధికారులకు ముఖ్యమంత్రి సూచించారు.
రాబోయే పది రోజుల పాటు ఆర్టీసీ ఇడిలు, ఉన్నతాధికారులు డిపోల వారీగా సమావేశాలు నిర్వహించి, ఎక్కడికక్కడ తగిన వ్యూహం రూపొందించాలని చెప్పారు. పెళ్లిళ్లు, విహార యాత్రలకు ఆర్టీసీ బస్సులు ఇచ్చే విషయంలో సరళమైన విధానం అనుసరించాలని చెప్పారు.
తాజా వార్తలు
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!







