గ్రాండ్ గా 25వ దుబాయ్ షాపింగ్ ఫెస్టివల్ షురూ..
- December 27, 2019
దుబాయ్ లో ప్రతీ సంవత్సరం నిర్వహించే 'దుబాయ్ షాపింగ్ ఫెస్టివల్-DSF' 25వ ఎడిషన్ గ్రాండ్ గా స్టార్ట్ అయ్యింది. ఈ సందర్భంగా కళ్లు మిరుమిట్లు గొలిపేలా ఏర్పాటు చేసిన లేజర్ షో అదుర్స్ అనిపించింది. ఇక దుబాయ్ ఐకాన్ టవర్ బుర్జ్ ఖలీఫా అయితే..స్పెక్టాకులర్ లేజర్ షోతో మెరిసిపోతోంది. అలాగే DSFను థీమ్ సాంగ్ ప్లే చేశారు. 1996లో ప్రారంభమైన దుబాయ్ షాపింగ్ ఫెస్టివల్ ఫస్ట్ ఎడిషన్ నుంచి ఈ థీమ్ ప్లే చేయటం ఆనవాయితీగా వస్తోంది. ఫెస్టివల్ ప్రారంభోత్సవం వేళ పెద్ద ఎత్తున బాణాసంచా పేల్చారు. ది బీచ్, అల్ సీఫ్, లా మెర్, దుబాయ్ ఫెస్టివల్ సిటీ మాల్, దుబాయ్ క్రీక్ లో సరిగ్గా 9 గంటలకు ఒకే సారి బాణాసంచా కాల్చారు.
దుబాయ్ షాపింగ్ ఫెస్టివల్ ప్రారంభోత్సవంలో బుర్జ్ పార్క్ లో ఏర్పాటు చేసిన కచేరీలో ఎమిరాతి సింగింగ్ సెన్సెషనల్ హుస్సేన్ అల్ జాస్మి సంగీత ప్రియులను అలరించారు. అలాగే చెబ్ ఖలీద్, షెరిన్ అబ్దేల్ వహాబ్ ఈ కచేరీలో పాల్గొన్నారు. దుబాయ్ ఒపెరాలో లెజెండరీ ఈజిప్టియన్ సింగర్ ఉమ్ కల్తౌమ్ ప్రదర్శన ఆకట్టుకుంది. శుక్రవారం గాయకుడు, గేయరచయిత జోర్జా స్మిత్ స్టేజ్ షో ఇవ్వబోతున్నారు.
ఇదిలాఉంటే..దుబాయ్ షాపింగ్ ఫెస్టిల్ వినియోగదారుల కోసం అదరిపోయే ఆఫర్లతో ఆహ్వానిస్తోంది. దాదాపు 4వేల స్టోర్స్ లోని 1000 బ్రాండ్లపై 75 శాతం డిస్కౌంట్ అఫర్లు ఉన్నాయి.
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు