ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్‌లో ఉద్యోగావకాశాలు
- December 28, 2019
ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ KVIC ఉద్యోగాల భర్తీ చేపట్టింది. మొత్తం 75 పోస్టుల భర్తీకిగాను నోటిఫికేషన్ జారీ చేసింది. పోస్టుల భర్తీ కాంట్రాక్ట్ పద్దతిలో జరుగుతుంది. కాంట్రాక్ట్ మూడేళ్లు ఉంటుంది. ఆ తరువాత అవసరాన్ని బట్టి పొడిగించే అవకాశం ఉంటుంది. పథకాలు, స్కీములకు సంబంధించిన అంశాల్లో అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యం ఉంటుంది. ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. 2020 జనవరి 10 దరఖాస్తుకు చివరి తేదీ. నోటిపికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ అధికారిక వెబ్సైట్ https://www.kvic.org.in/ చూడొచ్చు.
మొత్తం పోస్టులు : 75.. దరఖాస్తుకు చివరి తేదీ: 2020 జనవరి 10.. విద్యార్హత: మాస్టర్స్ డిగ్రీ లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ లేదా 2 ఏళ్ల పీజీ డిప్లొమా.. ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్ తెలిసుండాలి. వేతనం: రూ.25,000 నుంచి రూ.30,000 వరకు ఉంటుంది. ట్రాన్స్పోర్ట్ అలవెన్స్: రూ.2500 నుంచి రూ.3,000 వరకు ఉంటుంది. వయసు: 27 ఏళ్లు.
తాజా వార్తలు
- బహ్రెయిన్, కువైట్, ఖతార్, జోర్డాన్, ఒమాన్‌పై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన యూఏఈ
- మైసూరులో అధికారిక లాంఛనాలతో జానకమ్మ అంత్యక్రియలు పూర్తి
- ముంబై ఆసుపత్రిలో పవన్ కల్యాణ్‌ను పరామర్శించిన సీఎం చంద్రబాబు
- ఇరాన్ క్షిపణి, డ్రోన్ దాడులను తిప్పికొట్టిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- ఈజిప్ట్‌లో యూఏఈ అధ్యక్షుడు షేక్ మహ్మద్ బిన్ జాయెద్..
- తిరుమల అక్టోబర్ దర్శన టికెట్లు బుకింగ్ తేదీలు ఇవే
- బ్రిటన్‌లో బహ్రెయిన్ ఈడీబీ టూర్ సక్సెస్..!!
- ఖతార్‌లో చిన్నారి సహా ముగ్గురికి గాయాలు..!!
- పది మంది భారతీయ సిబ్బంది సేఫ్..రక్షించిన ఒమన్..!!
- సౌదీలో 15,430 మంది అక్రమ వలసదారులు అరెస్ట్..!!







