యూఏఈలో డ్రైవింగ్ చేస్తూ మొబైల్ వాడితే...భారీ జరిమానా

- December 28, 2019 , by Maagulf
యూఏఈలో డ్రైవింగ్ చేస్తూ మొబైల్ వాడితే...భారీ జరిమానా

యూఏఈ: ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనపై యూఏఈ పోలీసులు అక్కడి శుక్రవారం వాహనదారులకు మరో హెచ్చరిక జారీ చేశారు.ఇటీవల కాలంలో డ్రైవింగ్ చేస్తూ మొబైల్ ఉపయోగించడం వల్ల ప్రమాదాలు జరుగుతున్న సంఘటనలు పెరుగుతున్న నేపథ్యంలో తాజాగా పోలీసులు వాహనదారులను హెచ్చరించారు. అంతేగాక ఇకపై డ్రైవింగ్‌లో ఉన్నప్పుడు మొబైల్ వినియోగిస్తే 800 దిర్హామ్స్ జరిమానా, 4 బ్లాక్ పాయింట్లు వేస్తామని తెలిపారు. డ్రైవింగ్ చేస్తూ సెల్ ఫోన్ వాడడం వల్ల పరధ్యానంలో పడి ప్రమాదాలకు కారణమవుతుంది. అందుకే వాహనదారుల భద్రతతో పాటు ప్రజల భద్రత కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు అబుధాబి పోలీసులు వెల్లడించారు.

తాజాగా యూఏఈలో రోడ్డు ప్రమాదాలపై నిర్వహించిన సర్వేలో 71.4 శాతం డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మొబైల్ వినియోగించడం వల్ల పరధ్యానంలో పడి ప్రమాదాలు జరుగుతున్నట్లు తేలింది. యూఏఈలో 2018లో డ్రైవింగ్ చేస్తూ మొబైల్ వాడిన కేసులు 88, 619 నమోదయ్యాయి. అంటే రోజుకు 243 కేసులు. గత మూడేళ్లలో ఇలాంటి కేసులు 323,102 నమోదైనట్లు అక్కడి ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. 2018లో యూఏఈ వ్యాప్తంగా ఇలా డ్రైవింగ్ సమయంలో సెల్‌ఫోన్ వాడడం వల్ల 438 ప్రమాదాలు జరిగి 59 మంది చనిపోయారు. యూఏఈ ట్రాఫిక్ చట్ట ప్రకారం డ్రైవింగ్ సమయంలో డ్రైవర్లు మొబైల్‌లో సందేశం పంపించడం, ఫొటోలు తీసుకోవడం, తినడం, మేకప్ వేసుకోవడం వంటివి చేయకూడదని పేర్కొంటోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com