పెజావర స్వామీజీ కన్నుమూత

- December 29, 2019 , by Maagulf
పెజావర స్వామీజీ  కన్నుమూత

బెంగళూరు: పెజావర మఠాధిపతి విశ్వేశతీర్థ స్వామి (88) కన్నుమూశారు. ఆరోగ్యం క్షీణించడంతో ఆదివారం ఉదయం ఆయనను మణిపాల్‌ కేఎంసీ ఆస్పత్రి నుంచి ఉడుపి మఠానికి తరలించారు. మఠంలోనే తుది శ్వాస వదలాలని చెబుతుండే స్వామీజీ ...అన్నట్లుగా ఆయన మఠంలోనే పరమపదించారు. కాగా  అనారోగ‍్యంతో ఆయన ఈ నెల 20న  ఆస్పత్రిలో చేరారు. అప్పటి  నుంచి ఆస్పత్రిలోనే చికిత్స పొందుతున్నారు. అయితే పెజావర మఠాధిపతి ఆరోగ్యం రోజు...రోజుకు క్షీణించడంతో పాటు, కోలుకునే అవకాశాలు లేవని వైద్యులు తేల్చడంతో ఆయనను ఉడుపి మఠానికి తరలించారు.

మరోవైపు కర్ణాటక ముఖ్యమంత్రి యొడియూరప్ప ఉడుపి చేరుకున్నారు.  ఇవాళ శివమొగ్గ జిల్లా పర్యటనను రద్దు చేసుకున్న సీఎం  ఉడుపిలోనే ఉండనున్నారు. అలాగే కేంద్ర మాజీమంత్రి ఉమాభారతి ఉడుపి చేరుకున్నారు. పెజావర స్వామిని చూసేందుకు ఆమె ఇవాళ ఉదయం మఠానికి వచ్చారు. అలాగే పెజావర స్వామీజీ మరణ వార్త తెలియడంతో భక్తులు పెద్ద ఎత్తున మఠానికి తరలి వస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com