దుబాయ్:స్ట్రాటజిక్ ట్రాఫిక్ కారిడార్ 'అల్ కుద్రా-లెహ్బాబ్' రోడ్ ప్రాజెక్ట్ ప్రారంభం
- December 29, 2019
దుబాయ్:ఎక్స్‌పో రోడ్, జాఫ్జా, అబుదాబి వైపు వెళ్లే వాహనదారుల ప్రయాణ సమయాన్ని తగ్గించే మరో రోడ్డు ప్రాజెక్ట్ ప్రారంభమైంది. అన్ని దిశల్లోనూ ఫ్రీగా వెళ్లే సౌకర్యాలతో సిద్ధం చేసిన అల్ కుద్రా-లెహ్బాబ్ ఇంటర్ చేంజ్ డెవలప్ మెంట్ ప్రాజెక్టును ఎమిరాతిస్ రోడ్స్ అండ్ ట్రాన్స్ పోర్ట్ అథారిటీ ప్రారంభించింది. ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన ఫ్లై ఓవర్ తో ట్రాఫిక్ మరింత ఫ్రీగా మూవ్ అవుతుందని RTA వెల్లడించింది. ఎన్నో ప్రత్యేకతలు ఉన్న అల్ కుద్రా-లెహ్బాబ్ రహదారి వాహనదారులన గమ్యస్థానాలకు చేర్చటంలో కీలక ప్రాజెక్ట్ అని RTA అధికారులు చెబుతన్నారు. అందుకే ఈ రోడ్డును 'స్ట్రాటజిక్ ట్రాఫిక్ కారిడార్ 'గా అధికారులు భావిస్తున్నారు.
ప్రాజెక్టులో భాగంగా కలెక్టర్ రోడ్డులో ఇప్పటికే ఉన్న రెండు బ్రిడ్జిలకు పక్కనే మరో రెండు బ్రిడ్జిలను కన్ స్ట్రక్షన్ చేసినట్లు అధికారులు చెబుతున్నారు. బ్రిడ్జిలకు ఇరువైపులా ర్యాంప్స్, యూ టర్న్ ఏర్పాటు చేసినట్లు వివరించారు. దీంతో అల్ కుద్రా-లెహ్బాబ్ రహదారిపై అన్ని డైరెక్షన్స్ లో ట్రాఫిక్ ఈజీగా మూవ్ అవుతుంది. అలాగే ఈ రోడ్ కెపాసిటీ గంటకు 4,400 వాహనాలకు పెరుగుతుంది. ఈస్ట్వర్డ్ లెహ్బాబ్ రోడ్డు నుంచి నార్త్వర్డ్ అల్ కుద్రాకు ప్రయాణ సమయం 8 నిమిషాల వరకు తగ్గుతుంది. అలాగే వెస్ట్వర్డ్ లెహ్బాబ్ నుంచి నార్త్వడ్ అల్ కుద్రా వరకు వెళ్లే సమయం 4 నిమిషాల మేర ఆదా అవుతుంది. జుమైరా నుండి ఉమ్ సుకీమ్ స్ట్రీట్ వరకు అల్ కుద్రా కీలక రహదారిగా మారనుంది. అల్ కుద్రా-లెహ్బాబ్ రహదారి అభివృద్ధి ప్రాజెక్టులో భాగంగా కనెక్టింగ్ రోడ్ల విస్తరణ పనులు జరుగుతున్నాయి. అలాగే ఇంటర్ చేంజ్ బ్రిడ్జికి ఇరువైపులా సైకిల్ బ్రిడ్జి, రెయిన్ వాటర్ డ్రైనేజ్ సిస్టం పనులు చేపడతున్నారు.
తాజా వార్తలు
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్‌లో అస్సాం రైఫిల్స్‌పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!