పెజావర స్వామీజీ కన్నుమూత
- December 29, 2019
బెంగళూరు: పెజావర మఠాధిపతి విశ్వేశతీర్థ స్వామి (88) కన్నుమూశారు. ఆరోగ్యం క్షీణించడంతో ఆదివారం ఉదయం ఆయనను మణిపాల్ కేఎంసీ ఆస్పత్రి నుంచి ఉడుపి మఠానికి తరలించారు. మఠంలోనే తుది శ్వాస వదలాలని చెబుతుండే స్వామీజీ ...అన్నట్లుగా ఆయన మఠంలోనే పరమపదించారు. కాగా అనారోగ్యంతో ఆయన ఈ నెల 20న ఆస్పత్రిలో చేరారు. అప్పటి నుంచి ఆస్పత్రిలోనే చికిత్స పొందుతున్నారు. అయితే పెజావర మఠాధిపతి ఆరోగ్యం రోజు...రోజుకు క్షీణించడంతో పాటు, కోలుకునే అవకాశాలు లేవని వైద్యులు తేల్చడంతో ఆయనను ఉడుపి మఠానికి తరలించారు.
మరోవైపు కర్ణాటక ముఖ్యమంత్రి యొడియూరప్ప ఉడుపి చేరుకున్నారు. ఇవాళ శివమొగ్గ జిల్లా పర్యటనను రద్దు చేసుకున్న సీఎం ఉడుపిలోనే ఉండనున్నారు. అలాగే కేంద్ర మాజీమంత్రి ఉమాభారతి ఉడుపి చేరుకున్నారు. పెజావర స్వామిని చూసేందుకు ఆమె ఇవాళ ఉదయం మఠానికి వచ్చారు. అలాగే పెజావర స్వామీజీ మరణ వార్త తెలియడంతో భక్తులు పెద్ద ఎత్తున మఠానికి తరలి వస్తున్నారు.
తాజా వార్తలు
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!







