CAA, ఆర్టికల్ 370 పై ఇస్లామిక్ దేశాల మీటింగ్...
- December 29, 2019_1577630129.jpg)
పాకిస్తాన్:జమ్మూ కాశ్మీర్ స్వయంప్రతిపత్తికి సంబంధించిన ఆర్టికల్ 370 ని భారత ప్రభుత్వం రద్దు చేసిన తరువాత జరిగిన పరిణామాలను అంచనా వేసేందుకు ఇస్లామిక్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కంట్రీస్ (ఓఐసి) ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నది. ఇస్లామాబాద్‌లో పాకిస్తాన్ విదేశాంగ మంత్రి షా మెహమూద్ ఖురేషితో జరిగిన సమావేశంలో సౌదీ అరేబియా విదేశాంగ మంత్రి ఫైసల్ బిన్ ఫర్హాన్ అల్-సౌద్ ఈ విషయం చెప్పారు. ఈ విషయాన్ని పాకిస్తాన్ మీడియా వెల్లడించింది.
జమ్మూ కాశ్మీర్ పరిస్థితులను అంచనా వేయడానికి ఈ సమావేశాన్ని ఓఐసి సభ్య దేశాల విదేశాంగ మంత్రులు ముందుకు రావడాన్ని పాకిస్తాన్ పూర్తిగా సమర్థించింది. సౌదీ అరేబియా విదేశాంగ మంత్రితో జరిగిన సమావేశంలో కాశ్మీర్ సమస్యతో పాటు భారత పౌరసత్వ సవరణ చట్టంపైనా, NRC పైన కూడా చర్చించామని ఖురేషి అన్నారు. ఈ పరిణామాలు భారత్, సౌదీ మధ్య దౌత్య సంబంధాలను దెబ్బతీస్తుందని పలువరు భావిస్తున్నారు.
తాజా వార్తలు
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్‌లో అస్సాం రైఫిల్స్‌పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!