హైదరాబాద్:రవీంద్రభారతిలో ఘనంగా 'ఆట' ముగింపు సభలు
- December 29, 2019
హైదరాబాద్, డిసెంబర్ 29, 2019:అమెరికన్ తెలుగు అసోసియేషన్ తమ సాంస్కృతిక మరియు దాతృత్వ కార్యక్రమాలు (ఆటా వేడుకలు)ను తెలంగాణా మరియు ఆంధ్రప్రదేశ్‌లలో నిర్వహించింది. ఆటా వేడుకలు డిసెంబర్ 11వ తేదీ ప్రారంభమై డిసెంబర్ 29వ తేదీన రవీంద్రభారతిలో ముగిశాయి. గత 30 సంవత్సరాలుగా ఆటా తమ ఆటా వేడుకలను తెలుగు రాష్ట్రాలలో నిర్వహిస్తుంది. తెలుగు రాష్ట్రాల్లోని తెలుగువారిని యుఎస్ఏలోని తెలుగు వారితో అనుసంధానించడంతో పాటుగా మన సంస్కృతి, సంప్రదాయాలు, వారసత్వం చెక్కు చెదరకుండా ఉంచడం మరియు సాహిత్య, సాంస్కృతిక, విద్య, సామాజిక, ఆర్ధిక ఆరోగ్య, సామాజిక కార్యక్రమాలను తెలుగు రాష్ట్రాలలో చేయడం ద్వారా వాటిని ప్రోత్సహించడమే ఆటా వేడుకలు 2019 ముఖ్య లక్ష్యం.
ఈ సంవత్సరం తెలుగు రాష్ట్రాలలో నిర్వహిస్తున్న ఆటా వేడుకల కోసం అధ్యక్షుడు పరమేష్ భీమ్‌రెడ్డితో పాటుగా వేడుకల ఛైర్మన్ భువనేష్ బూజల సహా 50 మంది ఆటా సభ్యులు ప్రత్యేకంగా అమెరికా నుంచి వచ్చారు.ఈ ఆటా వేడుకలలో భాగంగా పలు గ్రామాల్లో వైద్య శిబిరాలను ఏర్పాటుచేశారు. వేలాది కుటుంబాలు వీటి ద్వారా ప్రయోజనం పొందాయి. అలాగే టాటా కంపెనీ ఇండియా సహకారంతో వృత్తి విద్యా శిక్షణను సైతం అందించారు. దీనిలో భాగంగా ఇంటర్మీడియట్ పాస్ అయిన విద్యార్థులకు నైపుణ్యాభివృద్ధి శిక్షణను 1000మందికి అందించడం ద్వారా తక్షణ ఉపాధినీ అందించారు. ఇదే రీతిలో హైదరాబాద్, వైజాగ్‌లలో యుఎస్-ఇండియా వ్యాపారవేత్తల నడుమ వ్యాపార సంబంధాలు వృద్ధి చేసేందుకు సమావేశాలను నిర్వహించారు. అలాగే పలు స్టార్టప్ కంపెనీలను కలుసుకుని మెంటారింగ్ మరియు ఆర్థిక మద్దతు అందించారు.
యుఎస్ కాన్సులేట్ మరియు తెలంగాణా రాష్ట్ర ఉన్నత విద్యామండలితో కలిసి యుఎస్, కెనడాలలో ఉన్నత విద్యనభ్యసించాలనుకునే విద్యార్థుల కోసం విద్యాసెమినార్లు సైతం నిర్వహించారు. ఇవిగాక 20 గ్రామాలలో పాఠశాలల అభివృద్ధి కార్యక్రమాలను, విద్యార్థులను ప్రోత్సహించేందుకు మెరిట్ స్కాలర్‌షిప్‌లు, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో అంతర్జాతీయ అక్ష్యరాస్యత సెమినార్ వంటివి నిర్వహించింది.
ఆటా వేడుకల ముగింపు కార్యక్రమాలను రవీంద్రభారతిలో నేడు నిర్వహించారు. దీనిలో భాగంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. అంతేగాక పలు రంగాలలో అశేష సేవలనందించిన వ్యక్తులకు పురస్కారాలను అందజేశారు. జీవిత సాఫల్య పురస్కారాన్ని సినీ నటుడు కృష్ణంరాజుకు అందజేశారు. అవార్డులు అందుకున్న ఇతర ప్రముఖులలో బండారు దత్తాత్రేయ (పబ్లిక్ సర్వీస్ ), నీరజ్ సంపతి (బిజినెస్ అండ్ స్పోర్ట్స్), కళా కృష్ణ, అశ్విని రాధోడ్ (కళలు), రాహుల్ సిప్లిగంజ్, కొమండూరి రామాచారి (సంగీతం), కట్నం గంగాధర తిలక్ (కమ్యూనిటీ అండ్ హ్యుమానిటేరియన్), సౌదామిని ప్రొద్దుటూరి (మహిళా సాధికారిత), కృష్ణమనేని పాపారావు (సామాజిక సేవ) ఉన్నారు.
తాజా వార్తలు
- దుబాయ్ లో నకిలీ హోటల్ ఫ్లోర్ లీజు..ఇద్దరికి జైలు శిక్ష..!!
- అల్-ముత్లా యాక్సిడెండ్, ఎమర్జెన్సీ సెంటర్ ప్రారంభం..!!
- మహిళకు జీవిత ఖైదు విధించిన బహ్రెయిన్ కోర్టు..!!
- 10 కిలోల మెత్ సీజ్ చేసిన సౌదీ కస్టమ్స్..!!
- ఒమన్‌లో ఐఫోన్ 17 సందడి..!!
- దోహాలో AGCFF U-17 గల్ఫ్ కప్ ప్రారంభోత్సవం..!!
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..