మస్కట్:ప్రవాసీయుల OCI కార్డ్స్ రెన్యూవల్ డెడ్ లైన్ పొడగింపు

- December 29, 2019 , by Maagulf
మస్కట్:ప్రవాసీయుల OCI కార్డ్స్ రెన్యూవల్ డెడ్ లైన్ పొడగింపు

మస్కట్: ఒమన్ కు వలసవెళ్లిన ఇండియన్స్ కి జారీ చేసే ఓవర్సీస్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా కార్డ్-OCI డెడ్ లైన్ వచ్చే జూన్ 30 వరకు పొడగించారు. అప్పటివరకు ప్రస్తుత కార్డులతో ట్రావెల్ చేసే వెసులుబాటు కల్పించారు. అయితే పాత పాస్ పోర్టుతో పాటు కొత్త పాస్ పోర్టును తప్పనిసరిగా క్యారీ చేయాల్సి ఉంటుంది. పాత పాస్ట్ పోర్ట్ OCI కార్డ్ వివరాల చెక్ చేస్తారు. కొత్త పాస్ పోర్టు ఐడెంటిఫికేషన్ చెక్ చేస్తారు. 

OCI కార్డులకు సంబంధించి మస్కట్ లోని భారత్ రాయబార కార్యాలయం నోటీస్ జారీ చేసింది. 20 ఏళ్ల లోపు, 50 ఏళ్లకు పైబడిన వారు OCI కార్డు పొందెందుకు వచ్చే జూన్ 30 వరకు గడువు పెంచుతున్నట్లు నోటీస్ లో పేర్కొంది. అలాగే 20 ఏళ్లలోపు వయస్సు ఉన్నవారు, 50 ఏళ్లలోపు వయస్సు ఉన్నవారు ట్రావెల్ సమయంలో ఏలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో కూడా నోటీస్ లో రాయబార కార్యాలయం  మెన్షన్ చేసింది.

20 ఏళ్లలోపు వయస్సున్న వారు పాస్ పోర్టు చేంజ్ చేసుకున్నా OCI కార్డు పొందకపోతే..పాత పాస్ పోర్టులో ని OCI కార్డు వివరాలతో ట్రావెల్ చేయవచ్చు. అయితే..కొత్త పాస్ పోర్టును ఐడెంటిఫికేషన్ కోసం చూపించాల్సి ఉంటుంది. అంటే రెండు పాస్ పోర్టులను తప్పనిసరిగా క్యారీ చేయాల్సిందే. అలాగే 50 ఏళ్లపై బడిన వారు కూడా పాస్ పోర్ట్ రెన్యూవల్ చేసుకున్నా OCI కార్డు తీసుకోకపోతే పాత పాస్ పోర్టులో నమోదైన OCI కార్డును అనుమతిస్తారు. ఐడెంటీఫికేషన్ కోసం కొత్త పాస్ పోర్టు చూపించాల్సి ఉంటుంది. అయితే..వచ్చే జూన్ 30లోపు మాత్రం OCI కార్డును తప్పనిసరిగా పొందాల్సి ఉంటుందని రాయబార కార్యాలయం తెలిపింది.

20 ఏళ్ల లోపు, 50 ఏళ్లపైబడిన వారికి పాస్ పోర్టు రెన్యూవల్ చేసిన ప్రతీసారి OCI కార్డు రీఇష్యూ తప్పనిసరి. 20-50 ఏళ్ల మధ్య వయస్కులకు మాత్రం పాస్ పోర్ట్ రెన్యూవల్ చేసిన ప్రతీసారి OCI కార్డు రి ఇష్యూ అవసరం లేదు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com