స్విమ్మింగ్ పూల్ డెత్ ట్రయల్: జిమ్ మేనేజ్మెంట్కి ఊరట
- December 30, 2019
బహ్రెయిన్: ఓ వ్యక్తి స్విమ్మింగ్ పూల్‌లో మృతి చెందిన ఘటనకు సంబంధించి, ఆ ప్రాంగణాన్ని నిర్వహిస్తోన్న జిమ్ మేనేజ్మెంట్కి ఊరట లభించింది. కింది స్థాయి కోర్టు, ఈ ఘటనకు సంబంధించి బాధిత కుటుంబానికి 40,000 బహ్రెయినీ దినార్స్ నష్టపరిహారంగా చెల్లించాలని ఆదేశించగా, సదరు సంస్థ హై అప్పీల్ కోర్టును ఆశ్రయించి ఊరట పొందింది. కేసు వివరాల్లోకి వెళితే, ఓ వ్యక్తి స్విమ్మింగ్ పూల్‌లో పడి ప్రాణాలు కోల్పోయారు. ఆ ప్రాంగణంలో సహాయకులు ఎవరూ లేరనీ, లైఫ్ జాకెట్స్ కూడా అందుబాటులో వుంచలేదనీ, ఈ కారణంగానే ఆ వ్యక్తి ప్రాణాలు కోల్పోయినట్లు బాధిత కుటుంబం పేర్కొంది. అయితే, 1.3 మీటర్ల లోతులోనే స్విమ్మింగ్ పూల్ వుందనీ, లైఫ్ జాకెట్లు అవసరంలేదని తన వాదనల్ని విన్పించిన జిమ్ సంస్థ, ఆ స్విమ్మింగ్ పూల్‌కి రెగ్యులర్‌గా వచ్చే కస్టమర్ గనుక అతనికి అన్ని విషయాలూ తెలుస్తాయనీ, ఇఫ్తార్ సమయంలో సహాయకులు ఎవరూ వుండరని తెలిసి కూడా స్విమ్మింగ్ పూల్‌లోకి దిగారని జిమ్ యాజమాన్యం పేర్కొంది. ఆ వాదనతో ఏకీభవించిన న్యాయస్థానం కింది కోర్టు ఇచ్చిన జరీమానా చెల్లించాలనే తీర్పుని కొట్టివేసింది.
తాజా వార్తలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్‌లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్‌లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..







