బహిష్కరణకు గురైన వలసదారుల అరెస్ట్
- December 30, 2019
కువైట్ సిటీ: జనరల్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ది రెసిడెన్స్ ఎఫైర్స్ ఇన్వెస్టిగేషన్, గత కొద్ది రోజుల్లో పలువురు వలసదారుల్ని అరెస్ట్ చేశారు. తమ ఫింగర్ ప్రింట్స్‌ని మార్చుకుని, అక్రమ మార్గంలో తిరిగి కువైట్‌లోకి వచ్చేందుకు నిందితులు ప్రయత్నించినట్లు అధికారులు గుర్తించారు. వీరంతా గతంలో డిపోర్టేషన్‌కి (బహిష్కరణకు) గురైనవారేనని అధికారులు వెల్లడించారు. అక్రమ మార్గంలో వీరంతా వీసాలు పొందారని అధికారులు పేర్కొన్నారు. పలు నేరాల్లో వీరిపై అభియోగాలు వున్నట్లు గుర్తించిన అధికారులు, అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. జిలీబ్ ప్రాంతంలో ఓ మహిళను ఇదే విధంగా అరెస్ట్ చేసినట్లు అధికారులు వెల్లడించారు.
తాజా వార్తలు
- హైవే ప్రయాణికులకు కేంద్రం భారీ శుభవార్త
- హైదరాబాద్ కి భారీ వర్షాల హెచ్చరిక..
- తానా ప్రపంచసాహిత్యవేదిక 94 వ సమావేశం విజయవంతం
- పేపర్ లీక్‌ల పై కఠిన చట్టం...
- ఇరాన్-ఒమన్ చర్చల్లో పురోగతి
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాపై నిషేధం..తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన ముఖ్య విషయాలు
- ఏపీ, తెలంగాణకు వాతావరణ శాఖ అలర్ట్
- భోగాపురానికి ప్రధాని మోదీ.. పూర్తి షెడ్యూల్ ఇదే !!
- జీవన నాణ్యతలో ఆసియాలో ఒమన్‌కు తొలి స్థానం..!!
- ఖతార్‌లో ట్రావెల్, ఎయిర్ కార్గో ఏజెన్సీలపై చర్యలు..!!







