సౌదీ అరేబియా:బిజినెస్‌ మరియు షాప్స్‌ ఇకపై 24 గంటలూ ఓపెన్‌

- December 30, 2019 , by Maagulf
సౌదీ అరేబియా:బిజినెస్‌ మరియు షాప్స్‌ ఇకపై 24 గంటలూ ఓపెన్‌

సౌదీ అరేబియాలో ఇకపై బిజినెస్‌లు మరియు షాప్‌లు ఇరవై నాలుగు గంటలు తెరిచి వుండేందుకు అనుమతులు ఇవ్వనున్నారు. జనవరి 1 నుంచి ఈ కొత్త విధానం అందుబాటులోకి రానుంది. పోస్ట్‌ ఆయిల్‌ ఎరాకి సంబంధించి అరబ్‌ ఎకానమీపై బిగ్గెస్ట్‌ రిఫార్మ్‌గా దీన్ని అభివర్ణిస్తున్నారు. మినిస్టర్‌ ఆఫ్‌ మున్సిపల్‌ అండ్‌ రూరల్‌ ఎఫైర్స్‌ మజీద్‌ అల్‌ కసాబి ఈ మేరకు ఓ ప్రకటన చేశారు. ఈ కొత్త విధానంతో రెసిడెంట్స్‌ రోజులో ఇరవై నాలుగ్గంటలూ షాపింగ్‌ చేసుకోవచ్చనీ, తద్వారా ఎకనమిక్‌ యాక్టివిటీ పెరుగుతుందని అన్నారాయన. ఔత్సాహిక కంపెనీలు ఈ కొత్త విధానంలోకి మారేందుకు 98,000 దిర్హామ్‌లు చెల్లించాల్సి వుంటుంది. ప్రేయర్‌ టైమ్స్‌లకు సంబంధించి రోజులో ఐదు సార్లు స్టోర్‌విరామం వుంటుంది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com