ఎక్స్- వైఫ్ ను కించపరిచేలా మేసేజ్ చేసిన వ్యక్తికి Dh20,000 ఫైన్

- December 31, 2019 , by Maagulf
ఎక్స్- వైఫ్ ను కించపరిచేలా మేసేజ్ చేసిన వ్యక్తికి Dh20,000 ఫైన్

యూ.ఏ.ఈ:విడాకులు ఇచ్చిన తర్వాత తన మాజీ భార్యను కించపరిచిన వ్యక్తికి దుబాయ్ ఉన్నత న్యాయస్థానం Dh 20,000 ఫైన్ విధించింది. జరిమానాతో పాటు లాయర్ ఛార్జీలను కూడా చెల్లించాలన్న దిగువ కోర్టు తీర్పును సమర్ధిస్తూ తీర్పునిచ్చింది. కోర్టు రికార్డుల వివరాల ప్రకారం..3 నెలల క్రితం నిందితుడు తన మాజీ భార్యను కోతితో పోలుస్తూ వ్యంగ్యంగా కవితను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ' చివరగా నేను రిలీవ్ అయ్యాను. ఆ కోతిని నరకానికి వెళ్లనివ్వండి' అంటూ తనను అవమానపరుస్తూ వాట్సాప్ నెంబర్ కు టెక్ట్స్ మెసేజ్ చేసినట్లు బాధితురాలు వాదనల సందర్భంగా కోర్టుకు విన్నవించింది. విడాకులు తీసుకున్న తర్వాత కూడా అభ్యంతరకర మెసేజ్ లను పంపిస్తూనే
ఉన్నాడని, కొన్ని ఇమేజెస్, వీడియోస్ పింపిస్తూ తనను వేధించాడని ఆమె తెలిపింది. తన ఆరోపణలను తగిన సాక్ష్యాలను, వాట్సాప్ మెసేజ్ లను కోర్టుకు సమర్పించింది.

అయితే..ఈ కేసులో అబుదాబి క్రిమినల్ కోర్టు గతంలోనే నిందితుడు వేధింపులకు పాల్పడినట్లు నిర్ధారించింది. 20 వేల దిర్హామ్ ల జరిమానాతో పాటు కోర్టు, లాయర్ ఖర్చులను భరించాలంటూ తీర్పునిచ్చింది. ఈ తీర్పుపై సంతృప్తి చెందని నిందితుడు తీర్పును సవాల్ చేస్తూ ఎగువ కోర్టును ఆశ్రయించాడు. విచారణ జరిపిన అబుదాబి కస్సెషన్ కోర్టు నిందితుడుపై ఆరోపణలు నిజమేనని నిర్ధారించింది. దిగువ కోర్టు ఇచ్చిన తీర్పు మేరకు జరిమానా చెల్లించాలంటూ ఆదేశించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com