జెడ్డా:సెలవుల సందర్భంగా హరమైన్ హైస్పీడ్ ట్రైన్ సర్వీసుల పెంపు
- December 31, 2019
జెడ్డా:మిడ్ అకాడమిక్ ఇయర్ వెకేషన్ సందర్భంగా హరమైన్ హై స్పీడ్ ట్రైన్ సర్వీసులను పెంచనున్నట్లు ట్రైన్ ప్రాజెక్ట్ అధికారులు వెల్లడించారు. జనవరి 3 నుంచి 19 వరకు డైలీ 16 సర్వీసులు నడపనున్నారు. ప్రతీ రోజు ఉదయం 8 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు ప్రయాణికులకు అందుబాటులో ఉంటుంది. జెడ్డాలోని కింగ్ అబ్దులాజీజ్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్-KAIA, రబీగ్ లోని కింగ్ అబ్దుల్లా ఎకానామిక్ సిటీ మీదుగా మక్కా నుంచి మదీన వరకు ట్రైన్ సర్వీసులు నడపనున్నారు. గత సెప్టెంబర్ 29లో అగ్రిప్రమాదం చోటు చేసుకున్న తర్వాత దాదాపు రెండున్నర నెలలు మక్కా నుంచి మదీనా మధ్య సర్వీసులను నిలిపివేశారు. డిసెంబర్ 18 నుంచి మళ్లీ సర్వీసులను పునరుద్ధరించారు.
తాజా వార్తలు
- యూఏఈలో ఏకైక సహజ జలపాతం.. ప్రజలకు అందుబాటులోకి వాడీ వురయ్యా..!!
- ఎల్‌నినో ప్రభావంపై సౌదీలో హెచ్చరికలు జారీ..!!
- వైద్య సిబ్బందికి కొత్త డ్రెస్ కోడ్ అమలు..!!
- ఇజ్రాయెల్ అధ్యక్షుడితో బహ్రెయిన్ రాజు హమద్ చర్చలు..!!
- కొత్త అంటువ్యాధి.. ప్రజలకు ఒమన్ సీడీఏఏ కీలక సూచనలు..!!
- మెట్రాష్‌లో కొత్త సర్వీస్.. ఫీజు చెల్లిస్తే ఈ-మెయిల్‌కే వీసా కాపీ..!!
- ఎమిరేట్స్ స్కైవార్డ్స్ సభ్యులకు యూరప్‌లో 12 వేలకు పైగా రైలు గమ్యస్థానాలకు మైల్స్‌తో ప్రయాణం
- యూఏఈలో ఆరు నెలల్లో 42 గృహ కార్మికుల నియామక సంస్థలకు జరిమానాలు
- పీఎం ఇంటర్న్‌షిప్ పథకంలో ఏపీకి మరిన్ని అవకాశాలు కోరిన ఎంపీ బాలశౌరి
- హైవే ప్రయాణికులకు కేంద్రం భారీ శుభవార్త







