త్వరలో ఖరారు కానున్న రాజధానికి గ్లోబల్ టెండర్లు..!!
- January 16, 2016
నవ్యాంధ్ర రాజధానిలో ప్రభుత్వ భవనాల నిర్మాణానికి సంబంధించి గ్లోబల్ టెండర్లను త్వరలో ఖరారు చేయను న్నారు. ఇప్పటికే ప్రపంచ ప్రసిద్ధిచెందిన ఆరు సంస్థల పేర్లు ప్రభుత్వ పరిశీల నలో ఉన్నాయి. సింగపూర్, జపాన్, చైనాకు చెందిన సంస్థల దరఖాస్తులు సీఆర్డీఏకు అందాయి. రాజధానిలో ప్రభుత్వ భవనాలు శాసనసభ, సచి వాలయం, రాజ్భవన్ల వరకే విదేశీ సంస్థలకు అప్పగించాలని ప్రభుత్వం భావిస్తోంది.
మిగిలిన నిర్మాణాలను దేశీయ కాంట్రాక్టు సంస్థలకు అప్పగించ నున్నారు. అయితే అమరావతిలో అత్యంత కీలకమైన సీడ్ కేపిటల్‌ను 8 చదరపు కిలోమీటర్లకు పైగా పరిధిలో నిర్మిస్తారు. సీడ్ కేపిటల్‌కు నిర్దేశించిన గ్రామాల్లో లింగాయపాలెం, ఉద్ధండరాయనిపాలెం, మందడం పరిధిలో హావ్లొట్గా ఉన్న తాళ్లాయపాలెం గ్రామాలు ఉన్నాయి. ఈ మూడు గ్రామా ల్లో సుమారు పదివేల పైచిలుకు జనాభా నివసిస్తున్నారు. ప్రభుత్వం రాజధా ని నిర్మాణానికి 31వేల 500 ఎకరాల భూమిని సమీకరించింది. ల్యాంబ్ పూలింగ్‌లో భాగంగా జరీబు, మెట్ట ప్రాంతాల్లో రైతులకు వారు కోరుకున్న ప్రాంతాల్లోనే భూమికి భూమి కింద రెసిడెన్షియల్, కమర్షియల్ జోన్లలో ప్రత్యామ్నాయ స్థలాలను కేటాయించాల్సి ఉంది. అయితే సీడ్ కేపిటల్ అత్యంత భద్రతా ప్రమాణాలతో నిర్మించాల్సి ఉన్నందున ఈ మూడు గ్రామాలకు నివేశన స్థలాలకు ఇతర గ్రామాల్లో కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ గ్రామాల్లో సుమారు వెయ్యి మంది వరకు రైతులు ల్యాండ్ పూలింగ్ కింద భూములు ఇచ్చారు. వీరికి జరీబు భూముల్లో 800 చదరపు గజాల స్థలంతో పాటు 400 గజాల వాణిజ్య సముదాయాల ప్రాంతంలో ప్రత్యామ్నాయం కేటాయిస్తామని ప్రభుత్వం తొలుత ప్రకటించింది. ప్రస్తుతం ఈ మూడు గ్రామాల్లో ఉన్న కట్టడాలను యథాతథంగా ఉంచి ప్రత్యామ్నాయంగా ల్యాండ్ పూలింగ్ రైతులకు శివారు గ్రామాల్లో భూములు కేటాయించనున్నారు. దీంతో గ్రామాల మధ్య చిచ్చురేగే అవకాశo ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్ర స్తుతం ఉన్న కట్టడాలు కూడా రాజధాని స్థాయిలో నిర్మాణాలు జరిగాక మంచి ధర వస్తే వాటిని అమ్ముకుని ఇతర ప్రాంతాలకు తరలిపోతారనే భవిష్యత్ దృక్పధంతోనే అధికారులు ఉన్నట్లు చెబుతున్నారు. రాజధాని నగరంలో శాసనసభ, సచివాలయం, రాజ్‌భవన్ నిర్మాణాలు పూర్తయి ఉద్యోగులు తరలివస్తే టౌన్‌షిప్‌లు అభివృద్ధి చేస్తారు. రాజధాని ప్రాంతంలో మొత్తం 22 టౌన్‌షిప్‌లను మూడు రకాలుగా వర్గీకరించారు. హెచ్ఐజీ, ఎంఐజీ, ఎల్ఐజీ కేటగిరీలు ఉన్నాయి. రాజధానికి సేకరించిన భూమిలో అభివృద్ధికి యోగ్యంగా 17వేల 307.3ఎకరాలు, విలేజి సెటిల్మెంట్స్గా 1244.2 ఎకరాలు, అభివృద్ధి యోగ్యంకాని ఐలండ్లు 949.3 ఎకరాలు ఇతర నిరుపయోగమైన భూమి 1440.1 ఎకరాలు ఉండగా నదీ పరివాహకంలో 255.1 ఎకరాలతో కలుపుకుని 21వేల 722.2 ఎకరాల మేర అభివృద్దికి ప్రణాళిక రూపొంందించారు. హెచ్ఐజి అంటే అత్యధిక ఆదాయ వర్గాల కోసం జీ ప్లస్ 15 భవనాలను 170 హెక్టార్లలో చేపడతారు. ఎంఐజీ మధ్యతరగతి వర్గాల నివాస సముదాయాలను 4860 హెక్టార్లలోను మరో 70 హెక్టార్లలో జీ ప్లస్ ఫోర్ కింద రెసిడెన్షియల్ నిర్మాణాలు జరుగుతాయి. అమరావతిలో 9 కాన్సెప్ట్ సిటీలకు మాస్టర్ ప్లాన్ ప్రతిపాదించింది. ప్రస్తుతం వ్యవసాయకంగా సాగుచేసి పురాతన కాలం నాటి కట్టడాలలో గ్రామాల ప్రజలు జీవనం సాగిస్తున్నారు. అభివృద్ధి విస్తృతమైతే ఉన్న కట్టడాలను కూల్చక తప్పదనే వాదన వినవస్తోంది. లేకపోతే మురికివాడ లుగా ముద్రపడి నగరానికి దూరంగా ఉండాల్సి వస్తుందనే ఆందోళన మొదలైంది. ప్రస్తుతం ఉన్న కట్టడాలను కూల్చేదిలేదని ప్రభుత్వం తేల్చిచెప్తున్నా భవిష్యత్తులో గ్రామ కంఠం పరిధిలోకి వచ్చే భవనాలు రాజధాని టౌన్‌షిప్‌ల ముందు వెలవెలబోతాయని అప్పుడైనా తాము అమ్ముకోవటమో లేక నిర్మాణాలను మార్చుకోవటమో చేయక తప్పదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సీడ్ కేపిటల్ ప్రాంతంలో భూమికి భూమి ఇచ్చేదిలేదని మొదటి నుంచి ప్రభుత్వం స్పష్టం చేస్తోందని, ప్రతి గ్రామంలోను రెసిడెన్షియల్, కమర్షియల్ జోన్లు ఉంటాయని పురపాలకశాఖ మంత్రి నారాయణ తెలిపారు. దీనిపై రైతులు అపోహ చెందవద్దని కోరారు. కీలకమైన ప్రభుత్వ భవన నిర్మాణాలకు అవసరమైన భూములు అందుబాటులో ఉంచుకోవాల్సి ఉందన్నారు. ప్రభుత్వ భవనాల పరిధిలో మాస్టర్ ప్లాన్ ప్రకారం అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని నిర్ణయం తీసుకున్నామని, ఇప్పటికే రైతులకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా రహదార్ల నిర్మాణం.. ఇతర జోన్ల వర్గీకరణలో సవరణలు తీసుకు వస్తున్నామని, సీడ్ కేపిటల్ ప్రతిపాదిత ప్రాంతంలో భూమికి భూమి సవరించే పరిస్థితులులేవని తేల్చిచెప్పారు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్‌లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్‌లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్‌లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్‌లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!







