హీరోగా నటించనున్న కమెడియన్ సప్తగిరి..!
- January 16, 2016
అలీ, సునీల్, వేణుమాధవ్, ధనరాజ్ లాంటి కమెడియన్స్ హీరోలుగా అదృష్టాన్ని పరీక్షించుకోగా ఇప్పుడు మరో కామెడీ స్టార్ హీరోగా ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతున్నాడు. డిఫరెంట్ డిక్షన్ తో ఆకట్టుకుంటున్న యంగ్ కమెడియన్ సప్తగిరి కూడా త్వరలోనే హీరోగా మారబోతున్నాడు. ఓ సీనియర్ డైరెక్టర్ సప్తగిరిని హీరోగా సినిమాను తెరకెక్కించడానికి రెడీ అవుతున్నాడు. ఇప్పటికే కథా చర్చలు కూడా పూర్తయిన ఈ సినిమా త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది.వెంకటాద్రి ఎక్స్ ప్రెస్, ప్రేమ కథాచిత్రం, జ్యోతి లక్ష్మీ, సౌఖ్యం లాంటి సినిమాలతో స్టార్ కమెడియన్ అనిపించుకున్న సప్తగిరి, సీనియర్ దర్శకుడు సాగర్ దర్శకత్వంలో హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు.అంతేకాదు ఈ సినిమాను సాగర్ దగ్గర దర్శకత్వం శాఖలో పనిచేసి స్టార్ డైరెక్టర్లుగా ఎదిగిన వినాయక్, శ్రీనువైట్ల, రవికుమార్ చౌదరి, నాగేశ్వర్ రెడ్డిలు నిర్మించడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే హీరోగా మారిన చాలా మంది కమెడియన్స్ సక్సెస్ కోసం ఎదురుచూస్తుండగా, సప్తగిరికి ఎలాంటి రిజల్ట్ వస్తుందో చూడాలి.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







