అమెరికాలో "చరితా రెడ్డి" మృతి..ఆమె కోరిక మేరకు అవయవాల దానం...
- December 31, 2019
అమెరికాలో రెండు రోజుల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలంగాణాకి చెందిన యువతి చరితా రెడ్డి బ్రెయిన్ డెడ్ అయ్యి కోమాలోకి వెళ్ళిన ఘటన అందరిని కలిచి వేసింది. అప్పటి నుంచీ చికిత్స పొందుతున్న ఆమె తుది శ్వాస విడిచారు. అయితే ఆమె గతంలో తీసుకున్న ఓ నిర్ణయం ఇప్పుడు అందరిని కంట తడి పెట్టిస్తోంది. వివరాలోకి వెళ్తే...
హైదరాబాద్ కి చెందిన చరితా రెడ్డి మిచిగాన్ లోని లాన్సింగ్ లో ఉంటోంది.స్థానికంగా అక్కడ ఓ ఐటీ కంపెనీలో పనిచేస్తున్న ఆమె తన స్నేహితులతో బయటకి వెళ్ళిన సమయంలో ఒక్క సారిగా వెనుక నుంచీ ఓ వాహనం వచ్చి బలంగా చరితా రెడ్డి ఉన్న వాహనాన్ని డీ కొట్టింది. ఆ సమయంలో కారు వెనుక భాగంలో చరితా రెడ్డి ఉండటంతో ఆమె కి బలమైన గాయాలు తగిలి స్పృహ కోల్పోయింది. దాంతో ఆమెని ఆసుపత్రిలో చేర్చగా రెండు రోజుల చికిత్స అనంతరం ఆమె మరణించినట్టు తెలిపారు వైద్యులు. అయితే ఆమె గతంలోనే తన ఆర్గాన్స్ డొనేట్ చేస్తున్నట్టుగా ఓ సంస్థకి అంగీకార పత్రం ఇచ్చారని తెలియడంతో ఆమె భంధువులు, స్నేహితులు కన్నీటి పర్యంతం అయ్యారు. ఆమె తీసుకున్న నిర్ణయం ఎంతో మంచిదని ఆమె చనిపోలేదని, తన అవయవాల దానంతో ఇతరులలో బ్రతికే ఉంటుందని భోరున విలపిస్తున్నారు. అయితే ఆమె శరీరాన్ని హైదరాబాద్ తీసుకు వెళ్ళడానికి అవసరమైన ఖర్చుల కోసం డొనేషన్స్ అభ్యర్ధించగా ఇప్పటికే సుమారు 20 వేల డాలర్లు వచ్చాయని ఆమె స్నేహితురాలు తెలిపారు.
తాజా వార్తలు
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్‌లో అస్సాం రైఫిల్స్‌పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!