రియాద్ ఆస్పత్రికి మారిషస్ అవిభక్త కవలలు: అరుదైన సర్జరీకి రెడీ

- January 02, 2020 , by Maagulf
రియాద్ ఆస్పత్రికి మారిషస్ అవిభక్త కవలలు: అరుదైన సర్జరీకి రెడీ

మారిషస్ అవిభక్త కవలలను విడదీసేందుకు మరో అడుగు ముందుకు పడింది. అవిభక్త కవలలు మొహమ్మద్, ఫధిల్ ను రియాద్ లోని రియాద్ లోని కింగ్ అబ్ధుల్లా చిల్డ్రన్ స్పెషాలిటీ ఆస్పత్రిలో చేర్పించారు. సౌదీ రాజు సల్మాన్, యువరాజు మొహ్మద్ బిన్ సల్మాన్ ఆదేశాల మేరకు చిన్నారులను విడదీసే అవకాశాలను ఆస్పత్రి డాక్టర్లు స్టడీ చేయనున్నారు. చిన్నారులకు మరో జీవితాన్ని ప్రసాదించేందుకు సౌదీ ప్రభుత్వం తీసుకున్న చొరవ పట్ల మొహమ్మద్, ఫధిల్ తండ్రి కృతజ్ఞతలు తెలిపారు. కింగ్ సల్మాన్ చూపిన మానవత్వం మరులేనిదని ప్రశంసించారు. దేవుడు తమకు మంచి చేస్తాడని విశ్వాసం వ్యక్తం చేశారు. ఆస్పత్రి సిబ్బంది అనుభవం, సామర్ధ్యంపై తమకు పూర్తి నమ్మకం ఉందని ఆయన అన్నారు. సౌదీ నేషనల్ సియామీ ట్విన్స్ సపరేషన్ ప్రొగ్రామ్ లో భాగంగా మారిషన్ అవిభక్త కవలలను వైద్య బృందం స్టడీ చేస్తోంది. అన్ని కుదిరి ఆపరేషన్ కు మెడికల్ టీం ఓకే చెబితే..ప్రపంచంలోనే 49వ అవిభక్త కవలల అపరేషన్ గా గుర్తింపు పొందనుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com