గంటకు 300 కిలోమీటర్లకు వేగాన్ని పెంచిన హరామేన్‌ రైల్వే

- January 02, 2020 , by Maagulf
గంటకు 300 కిలోమీటర్లకు వేగాన్ని పెంచిన హరామేన్‌ రైల్వే

జెడ్డా:హరామేన్‌ హై స్పీడ్‌ రైల్వే, రబిగ్‌ హరియు మదినా మధ్య హై స్పీడ్‌ రైళ్ళ వేగాన్ని గంటకు 300 కిలోమీటర్లకు పెంచినట్లు పేర్కొంది. జనవరి 1 నుంచి ఈ వేగం అమల్లోకి వస్తుంది. కింగ్‌ అబ్దుల్లా ఎకనమిక్‌ సిటీ - మదినా మధ్య ఈ వేగంతో రైళ్ళు ప్రయాణిస్తాయి. పెరిగిన వేగంతో ప్రయాణ సమయం గణనీయంగా తగ్గనుంది. మిడ్‌ ఎకనమిక్‌ వెకేషన్‌ సమయంలో హరామేన్‌ ట్రెయిన్‌ రోజుకి 16 సర్వీసుల్ని నడపనుంది. జూన్‌ 3 నుంచి జూన్‌ 19 వరకు ఈ సర్వీసులు నడుస్తాయి. ఉదయం 8 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు ఈ సర్వీసులు అందుబాటులో వుంటాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com