దుబాయ్:'బ్లూ డైమండ్ వర్కర్స్' క్యాంపు లో నూతన సంవత్సర వేడుకలు
- January 02, 2020
దుబాయ్: దుబాయ్ లోని సోనాపూర్ లో 'బ్లూ డైమండ్ వర్కర్స్' క్యాంపు లో నూతన సంవత్సర వేడుకలు బీజేపీ తెలంగాణ UAE NRI సెల్ ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకున్నారు.ఈ కార్యక్రమానికి నిజామాబాద్ ఎం.పి అరవింద్ ధర్మపురి ముఖ్య అతిధిగా విచ్చేసారు.ఇండియన్ వైస్ కాన్సుల్ జనరల్ జస్పాల్ అహుజా,IPF టీం సభ్యులు,మిడిల్ ఈస్ట్ NRI సెల్ ఇంచార్జ్ నరేంద్ర పన్నీరు,తెలుగు సంఘాల నాయకులు,వివిధ రంగాలకి చెందిన పలువురు ప్రముఖులు మరియు 300 మంది పైగా కార్మికులు పాల్గొన్నారు.ఎం.పి అరవింద్ ధర్మపురి మాట్లాడుతూ ఫైనాన్సియల్ ప్లానింగ్ సరిగ్గా చేసుకుని తమ కుటుంబానికి ఉపయోగ పడేలా చూసుకోవాలని కార్మికులకు సూచించారు.ప్రవాసీయులతో వీలైనంతగా ఎక్కువగా సంప్రదింపులలో ఉండాలనే ఉద్దేశ్యంతో గురువారం రోజున నిజామాబాద్‌లో పౌరసత్వ చట్టం అనుకూల సభలో ఉన్నప్పటికి, తాను దుబాయ్ కి వచ్చినట్లుగా ఎం.పి అరవింద్ చెప్పారు.
ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రముఖులు కార్మికులను ఉద్దేశించి ప్రసంగించారు.నూతన సంవత్సరం సంధర్భంగా కేక్ కట్ చేసారు. ఈ కార్యక్రమం అనంతరం ఎం.పి అరవింద్ కార్మికుల కష్టాల గురించి అడిగి తెలుసుకున్నారు.చివరగా కార్యక్రమాన్ని విందుతో ముగించారు.
తాజా వార్తలు
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్‌లో అస్సాం రైఫిల్స్‌పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!