ఒమన్ లో ఈ రోడ్డుపై వెళ్తున్నారా?..ఐతే జాగ్రత్తగా డ్రైవ్ చేయండి
- January 04, 2020
మస్కట్:అల్ అమెరాత్ రోడ్డుపై ట్రావెల్ చేసే వాహనదారులు జాగ్రత్తగా డ్రైవ్ చేయాలని మస్కట్ మున్సిపాలిటి అధికారులు హెచ్చరిస్తున్నారు. సండే మార్నింగ్ వరకు మెయిన్టనెన్స్ పనులు జరుగుతున్న కారణంగా మోటరిస్ట్ లు డ్రైవ్ చేసే సమయంలో అలర్ట్ గా ఉండాలని సూచిస్తున్నారు. అల్ అమెరాత్ స్ట్రీట్ నుంచి అల్ అఖ్దర్, అల్ అమరత్ వైపు వెళ్లే మార్గంలో మిడిల్ అండ్ స్లో లేన్స్ మూసివేస్తున్నట్లు ప్రకటించింది. రాయల్ ఒమన్ ట్రాఫిక్ పోలీసుల సహకారంతో అల్ అమెరాత్ మార్గంలో తాత్కాలిక ఆంక్షలు అమలు చేస్తున్నారు. గత గురువారం సాయంత్రం నుంచి చేపట్టిన మెయిన్టెన్స్ పనులు ఆదివారం ఉదయం వరకు కొనసాగుతాయి. దీంతో అల్ అమెరాత్ మార్గంలో వెళ్లే వారు ట్రాఫిక్ సూచనలను, జాగ్రత్తలను పాటించాలని మస్కట్ మున్సిపాలిటీ అధికారులు చెబుతున్నారు.
తాజా వార్తలు
- దుబాయ్ లో నకిలీ హోటల్ ఫ్లోర్ లీజు..ఇద్దరికి జైలు శిక్ష..!!
- అల్-ముత్లా యాక్సిడెండ్, ఎమర్జెన్సీ సెంటర్ ప్రారంభం..!!
- మహిళకు జీవిత ఖైదు విధించిన బహ్రెయిన్ కోర్టు..!!
- 10 కిలోల మెత్ సీజ్ చేసిన సౌదీ కస్టమ్స్..!!
- ఒమన్‌లో ఐఫోన్ 17 సందడి..!!
- దోహాలో AGCFF U-17 గల్ఫ్ కప్ ప్రారంభోత్సవం..!!
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..