నిర్మాణ రంగం మీద దృష్టి పెడుతున్నాజగపతి బాబు..

- January 17, 2016 , by Maagulf
నిర్మాణ రంగం మీద దృష్టి పెడుతున్నాజగపతి బాబు..

హీరోగా మంచి విజయాలు సాధించిన జగపతి బాబు తరువాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, విలన్ గానూ మెప్పిస్తున్నారు. ప్రస్తుతం స్టార్ హీరోల సినిమాల్లో కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సీనియర్ నటుడు, త్వరలో మరో పాత్రకు రెడీ అవుతున్నాడు. ఇప్పటి వరకు తెర మీద మాత్రమే కనిపించిన జగ్గుబాయ్, నిర్మాణ రంగం మీద దృష్టి పెడుతున్నాడు. స్టార్ ప్రొడ్యూసర్ తనయుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన జగపతిబాబు ఆ వారసత్వాన్ని కొనసాగించడానికి రెడీ అవుతున్నాడు.జగపతిబాబు తండ్రి విబి రాజేంద్ర ప్రసాద్ జగపతి ఆర్ట్ పిక్చర్స్ బ్యానర్ పై ఎన్నో అద్భుత చిత్రాలను తెరకెక్కించారు. ముఖ్యంగా ఏఎన్నార్ హీరోగా ఈ బ్యానర్ లో తెరకెక్కిన సినిమాలు సంచలన విజయాలు నమోదు చేశాయి.
    జగపతి బాబు హీరోగా పరిచయం అయిన తరువాత రాజేంద్రప్రసాద్ సినీ నిర్మాణం ఆపేశారు. ఇప్పుడు జగపతిబాబు తండ్రి వారసత్వాన్ని కొనసాగించటానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు.అయితే తండ్రి స్థాపించిన జగపతి ఆర్ట్ పిక్చర్స్ బ్యానర్ పై కాకుండా క్లిక్ సినీ కార్ట్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో కొత్త ప్రొడక్షన్ హౌస్ ను ఏర్పాటు చేస్తున్నారు. ఈ బ్యానర్ సంవత్సరానికి కనీసం నాలుగు సినిమాలు తెరకెక్కించేలా ప్లాన్ చేసుకుంటున్నారు. లో బడ్జెట్ సినిమాలను తెరకెక్కిస్తూ కొత్త నటీనటులను, దర్శకులను ప్రొత్సహించే ఆలోచనలో ఉన్నాడు. జగపతిబాబు, తన పుట్టిన రోజున ప్రొడక్షన్ హౌస్ పై ప్రకటన చేయనున్నాడు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com