విజయవాడ విమానాశ్రయం నుంచి త్వరలో రెండు అంతర్జాతీయ సర్వీసులు
- January 04, 2020
విజయవాడ: విజయవాడ విమానాశ్రయం నుంచి త్వరలో రెండు అంతర్జాతీయ సర్వీసులు ప్రారంభంకానున్నాయి. విజయవాడ నుంచి దోహా, ముంబయిలకు ఈ విమాన సర్వీసులు నడుస్తాయి. ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ సంస్థ ఈ విదేశీ సర్వీసులను నడపటానికి ఆసక్తి చూపిస్తోంది. విజయవాడ నుంచి ముంబయికి ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ సంస్థ వారంలో మూడు రోజులు బోయింగ్ 737-800 విమాన సర్వీసులను న డుపుతోంది. ఇక్కడి నుంచి బయల్దేరే ఈ సర్వీసు మూడు రోజుల్లో ఒకరోజు దోహాకు, మరోరోజు షార్జాకు నడపాలని భావిస్తున్నారు. అయితే, ఆయా దేశాలకు ఇక్కడి నుంచి వెళ్లేవారు ముంబయికి కచ్చితంగా వెళ్లాల్సి ఉంటుంది. బ్యాగేజీ చెకిన్ వంటివి విజయవాడ విమానాశ్రయంలోనే నిర్వహిస్తారు. బోర్డింగ్ పాస్ కూడా ఇక్కడే ఇస్తారు. ముంబయి విమానాశ్రయంలో కస్టమ్స్, ఇమిగ్రేషన్ చెకిన్ పూర్తి చేసుకుంటే చాలు. విజయవాడ విమానాశ్రయంలో కస్టమ్స్, ఇమిగ్రేషన్‌లు ఉన్నాయి. అయినా భద్రతాపరమైన కారణాల దృష్ట్యా ముంబయిలోనే కస్టమ్స్, ఇమిగ్రేషన్ చెకిన్ నిర్వహించనున్నారు.
విజయవాడ విమానాశ్రయంలో లగేజీ చెకిన్, బోర్డింగ్ పాస్ పూర్తయినవారు మాత్రం ముంబయి విమానాశ్రయంలో కస్టమ్స్, ఇమిగ్రేషన్ హోల్డింగ్ ఏరియాలోకి వెళ్లిపోవచ్చు. అక్కడ క్లియరెన్స్ అయ్యాక నేరుగా ఆయా దేశాలకు వెళ్లే విమానాల్లో వెళ్లిపోవచ్చు. ఇప్పటివరకు ఉన్న సమాచారం మేరకు.. ముంబయికి వచ్చిన విమానంలోనే దోహా, షార్జాలకు వెళ్లే అవకాశం ఉంటుంది. మరో విమాన సర్వీసులో వెళ్లే అవకాశాలు కూడా లేకపోలేదు. దీనిపై స్పష్టత రావాల్సి ఉంది. అయితే, ఈ విమానాలు ఏ రోజు, ఏ ప్రాంతానికి నడుపు తారన్న దానిపై ఇంతవరకు స్పష్టత రాలేదు. షెడ్యూల్‌ను త్వరలో ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. 45 రోజుల్లోపే విమాన సర్వీసులు ప్రారంభించే అవకాశం ఉందని తెలుస్తోంది.
తాజా వార్తలు
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్‌లో అస్సాం రైఫిల్స్‌పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!