దుబాయ్:గ్లోబల్ చైల్డ్ ప్రాడిజీ అవార్డ్ 2020 విజేతగా ఇండియన్ బాలిక
- January 04, 2020
దుబాయ్ లోని ఇండియన్ హై స్కూల్ నైటింగేల్ గా గుర్తింపు పొందిన సుచెత సతీష్ మరో అద్భుతాన్ని సాధించింది. గ్లోబల్ బాల మేధావి-2020 అవార్డు గెల్చుకొని ఇండియన్ కమ్యూనిటీతో పాటు యూఏఈ మరోసారి గర్వపడేలా చేసింది. 13 ఏళ్ల సుచేత ఏకంగా 120 భాషల్లో అనర్గళంగా పాడి సింగింగ్ కేటగిరిలో గ్లోబల్ చైల్డ్ ప్రాడిజీ అవార్డ్ 2020 విజేతగా నిలిచింది. ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో సుచెత ఈ అవార్డును ఆమె అందుకుంది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హజరైన నోబెల్ పీస్ ప్రైజ్ విన్నర్ కైలాష్ సత్యర్థి చేతుల మీదుగా అవార్డు అందుకోవటం ఎంతో ఎక్సైట్ మెంట్ గా ఉందని ఆమె ఆనందం వ్యక్తం చేశారు. వివిధ కేటగిరిలో గ్లోబల్ చైల్డ్ ప్రాడిజీ అవార్డ్ 2020లో విజేతలుగా నిలిచిన 100 మంది టాలెంటెడ్ చైల్డ్స్ కూడా అవార్డ్ అందుకున్నారు.
తాను రెండు వరల్డ్ రికార్డ్స్ తో ఈ అవార్డుకు ఎంపికైనట్లు సుచెత సంతోషం వ్యక్తం చేసింది. రెండు సంవత్సరాల క్రితం దుబాయ్ లోని ఇండియన్ కాన్సులెట్ ఆడిటోరియంలో 6 గంటల 15 నిమిషాల పాటు దాదాపు 120 భాషల్లో అనర్గళంగా పాటలు పాడిన సుచిత ట్విన్ వరల్డ్ రికార్డ్స్ క్రియేట్ చేసింది. ఎక్కువ లాంగ్వేజెస్ లో పాడినందుకు ఒక రికార్డ్, లాంగ్ టైం పాడినందుకు మరో రికార్డ్ ఆమె వశం అయ్యాయి.
చిన్నారుల్లో అసాధారణ ప్రతిభ చాటుకునే వేదికైన గ్లోబల్ చైల్డ్ ప్రాడిజీ అవార్డ్ 2020 దాదాపు 100 కేటగిరిలు ఉంటాయి. సింగింగ్, డ్యాన్సింగ్, మ్యూజిక్, ఆర్ట్, రైటింగ్, యాక్టింగ్, మోడలింగ్, సైన్స్, ఇన్నోవేషన్, స్పోర్ట్స్ ఇలా చైల్డ్స్ తమ టాలెంట్ ప్రదర్శించొచ్చు. భారత మాజీ రాష్ట్రపతి దివంగత అబ్దుల్ కలాం పేరు మీద స్థాపించిన డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ఇంటర్నేషనల్ ఫౌండేషన్ తో పాటు అస్కార్ దక్కించుకున్న మ్యూజిక్ ప్రొడ్యూసర్ ఎఆర్ రెహ్మన్ సహకారంతో టాలెంట్ హంట్ కొనసాగుతోంది. ఈ ఏడాది విజేతలకు ఢిల్లీలో అవార్డులను అందజేశారు.
తాజా వార్తలు
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్‌లో అస్సాం రైఫిల్స్‌పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!