అబుదాబీ టోల్ సిస్టమ్: అన్ రిజిస్టర్డ్ వెహికిల్స్‌కి గ్రేస్ పీరియడ్
- January 04, 2020
అబుదాబీలో టోల్‌గేట్స్ గురువారం నుంచి అమల్లోకి వచ్చాయి. అయితే, ఇప్పటికీ టోల్ గేట్స్ ట్రాఫిక్ సిస్టమ్‌తో రిజిస్ట్రేషన్‌కి సమస్యలు ఎదుర్కొంటున్న వాహనాలకు ఉపశమనాన్ని ప్రకటించారు. ది డిపార్ట్‌మెంట్ ఆఫ్ మునిసిపాలిటీస్ అండ్ ట్రాన్స్‌పోర్ట్, ఇంటిగ్రేటెడ్ ట్రాన్స్‌పోర్ట్ సెంటర్, మూడు నెలలపాటు గ్రేస్ పీరియడ్‌ని ప్రకటించడం జరిగింది. పెనాల్టీ ఫేర్స్ ఇప్పటినుంచే అందుబాటులోకి రావడంలేదనీ, టోల్ గేట్ సిస్టమ్ మూడు నెలల గ్రేస్ పీరియడ్ అందిస్తోందనీ, వాహనాన్ని తగిన సమయంలో రిజిస్టర్ చేసుకుని, అకౌంట్‌లో తగిన బ్యాలెన్స్ వుంచుకోవాలని ఈ సందర్భంగా అధికారులు సూచించారు. కాగా, టోల్‌గేట్ సిస్టమ్‌కి సంబంధించి రిజస్ట్రేషన్ విషయంలో సమస్యలు ఎదుర్కొంటున్నట్లు దుబాయ్ వాహనదారులు వాపోతున్నారు.
తాజా వార్తలు
- హైవే ప్రయాణికులకు కేంద్రం భారీ శుభవార్త
- హైదరాబాద్ కి భారీ వర్షాల హెచ్చరిక..
- తానా ప్రపంచసాహిత్యవేదిక 94 వ సమావేశం విజయవంతం
- పేపర్ లీక్‌ల పై కఠిన చట్టం...
- ఇరాన్-ఒమన్ చర్చల్లో పురోగతి
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాపై నిషేధం..తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన ముఖ్య విషయాలు
- ఏపీ, తెలంగాణకు వాతావరణ శాఖ అలర్ట్
- భోగాపురానికి ప్రధాని మోదీ.. పూర్తి షెడ్యూల్ ఇదే !!
- జీవన నాణ్యతలో ఆసియాలో ఒమన్‌కు తొలి స్థానం..!!
- ఖతార్‌లో ట్రావెల్, ఎయిర్ కార్గో ఏజెన్సీలపై చర్యలు..!!







