సోదరి కొడుకును రేప్ చేసిన భర్తకు విడాకులు ఇచ్చిన భార్య
- January 04, 2020
బహ్రెయిన్ లో అసాధారణ కేసులో భర్తకు విడాకులు ఇచ్చింది. తన సోదరి కొడుకుపై పదే పదే అత్యాచారానికి తెగబడిన వ్యక్తితో తాను ఉండలేనంటూ బాధితురాలు చేసుకున్న అభ్యర్ధనకు షరియత్ అప్పిల్స్ కోర్టు అంగీకరించింది. ఆ వ్యక్తి దాదాపు 20 సార్లు నెఫ్యూను రేప్ చేసినట్లు ఉన్నత క్రిమినల్ కోర్టులో నిర్ధారించబడింది. దీంతో ఆ భర్త నుంచి భార్యకు విడాకులు మంజూరు చేస్తూ షరియత్ అప్పిల్స్ కోర్టు తీర్పునిచ్చింది.
అయితే..ఈ కేసులో విడాకులకు భర్త అంగీకరించలేదు. సిల్లి రీజన్స్ తో విడాకులు కోరడం ఏమిటని అతను వాదన వినిపించాడు. అంతకుముందు హై షరియత్ కోర్టు కూడా ఆమె విడాకుల పిటీషన్ ను తిరస్కరించింది. అతను పాల్పడిన నేరానికి, విడాకుల కేసు రెండు వైరుధ్యమున్న కేసులని, ఒకదానితో ఇంకోదానికి సంబంధం లేదు కనుక విడాకుల అవసరం లేదని భావిస్తున్నట్లు కోర్టు తెలిపింది. అయితే..ఆ మహిళ ఓ ఉన్మాద భర్తతో తాను ఉండలేను అంటూ తనకు న్యాయం చేయాలంటూ షరియత్ అప్పీల్స్ కోర్టును ఆశ్రయించింది. భర్త చేసిన ఘాతుకంతో ఆమె మానసికంగా కుంగిపోయిందని, తన సైకలాజికల్ డ్యామేజ్ కు విడాకులు ఒక్కటే మార్గమని బాధితురాలి తరపు లాయర్ కోర్టులో వాదనలు వినిపించారు. సోదరి కొడుకును బెదిరించి 20 సార్లు అత్యాచారానికి తెగబడిన వ్యక్తి తన క్లయింట్ ఉండలేదని కోర్టుకు విన్నవించింది. బాధితురాలి తరపు వాదనలతో ఏకీభవించిన కోర్టు ఆమెకు విడాకులు మంజూరు చేసింది.
తాజా వార్తలు
- హైవే ప్రయాణికులకు కేంద్రం భారీ శుభవార్త
- హైదరాబాద్ కి భారీ వర్షాల హెచ్చరిక..
- తానా ప్రపంచసాహిత్యవేదిక 94 వ సమావేశం విజయవంతం
- పేపర్ లీక్‌ల పై కఠిన చట్టం...
- ఇరాన్-ఒమన్ చర్చల్లో పురోగతి
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాపై నిషేధం..తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన ముఖ్య విషయాలు
- ఏపీ, తెలంగాణకు వాతావరణ శాఖ అలర్ట్
- భోగాపురానికి ప్రధాని మోదీ.. పూర్తి షెడ్యూల్ ఇదే !!
- జీవన నాణ్యతలో ఆసియాలో ఒమన్‌కు తొలి స్థానం..!!
- ఖతార్‌లో ట్రావెల్, ఎయిర్ కార్గో ఏజెన్సీలపై చర్యలు..!!







