1 మిలియన్ వ్యూస్ సర్ధార్ టీజర్‌కు

- January 17, 2016 , by Maagulf
1 మిలియన్ వ్యూస్ సర్ధార్ టీజర్‌కు

పవన్ కళ్యాణ్ , కాజల్ ప్రధాన పాత్రలలో తెరకెక్కుతున్న సర్ధార్ చిత్ర షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లోని భారీ సెట్‌లో జరుగుతుంది. సంక్రాంతి బ్రేక్ లేకుండా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం మే నెలలో విడుదలవుతుందనే వార్తలు వస్తోండగా, ఈ చిత్రానికి సంబంధించిన ఓ టీజర్‌ను పొంగల్ కానుకగా విడుదల చేశారు.ఇటీవల విడుదలైన సర్ధార్ టీజర్‌లో పవన్ గళ్ళ లుంగీతో, గుర్రం పట్టుకొని నడుస్తూ వస్తున్నట్టు దర్శనమివ్వగా, ఈ టీజర్‌కు లెక్కలేనన్ని లైకులు పడ్డాయి. టీజర్ విడుదలైన 48 గంటలలోపే 1 మిలియన్ వ్యూస్ సర్ధార్ టీజర్‌కు దక్కగా, సరిక్రొత్త రికార్డును క్రియేట్ చేసింది. దీంతో పవన్ స్టామినా మరోసారి బయటపడింది. ఇక టీజరే ఇన్ని సెన్సేషన్స్ క్రియేట్ చేస్తే , విడుదల తర్వాత సర్ధార్ చిత్రం ఇంకెన్ని రికార్డులు తన ఖాతాలో వేసుకుంటుందో చూడాలి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com