యూరోపియన్ వలసదారుడ్ని రక్షించిన దుబాయ్ పోలీస్
- January 06, 2020
దుబాయ్: యూరోపియన్ వలసదారుడొకరు ఆత్మహత్యకు యత్నించగా, అతన్ని దుబాయ్ పోలీసులు చాకచక్యంగా రక్షించారు. రాత్రి 11 గంటల సమయంలో ఘటన గురించిన సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే, సంఘటనా స్థలానికి చేరుకుని, ఆత్మహత్యకు యత్నించిన వ్యక్తిని కాపాడినట్లు దుబాయ్ పోలీస్ బ్రిగేడియర్ జమాల్ అల్ జల్లాఫ్బ్రిగేడియర్ జమాల్ అల్ జలాఫ్ చెప్పారు. బదా ఏరియాలో ఆ వ్యక్తి నివసిస్తున్నట్లు గుర్తించామనీ, రికార్డు సమయంలో అక్కడికి ఓ అధికారి చేరుకున్నారనీ, వెంటనే అతన్ని రక్షించామని ఆయన వివరించారు. బెల్టుతో ఉరివేసుకుని నిందితుడు ఆత్మహత్యకు యత్నించాడు. ఈ క్రమంలో ఆయన ముందుగా సూసైడ్ నోట్ కూడా రాశాడు. దుబాయ్ పోలీస్ సైకలాజికల్ టీమ్, అతనికి కౌన్సిలింగ్ ఇచ్చేందుకు ప్రయత్నించారు.
తాజా వార్తలు
- 10 కిలోల మెత్ సీజ్ చేసిన సౌదీ కస్టమ్స్..!!
- ఒమన్‌లో ఐఫోన్ 17 సందడి..!!
- దోహాలో AGCFF U-17 గల్ఫ్ కప్ ప్రారంభోత్సవం..!!
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్‌లో అస్సాం రైఫిల్స్‌పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC