విదేశీ బలగాలను బహిష్కరిస్తాం
- January 06, 2020
బాగ్దాద్:తమ దేశంలో ఉన్న విదేశీ బలగాలను బహిష్కరించనున్నట్టు ఇరాక్ ప్రకటించింది. ఈ మేరకు పార్లమెంట్ ఆదివారం కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. తమ దేశంలో ఉన్న విదేశీ బలగాలను బహిష్కరించడమే లక్ష్యంగా తీర్మానానికి పార్లమెంటు మద్దతు పలికింది. ముఖ్యంగా ఇరాక్‌లో ప్రస్తుతం ఉన్న 5 వేల మంది అమెరికా బలగాలే లక్ష్యంగా వారు తాజా నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. బాగ్దాద్‌లో ఇరాన్ ఆర్మీ చీఫ్ సులేమాని హత్య జరిగిన రెండు రోజుల అనంతరం ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో వారు ఈ నిర్ణయానికి రావడం గమనార్హం. నాలుగేండ్ల కిందట ఐఎస్‌తో పోరాటం చేయడానికి ఇరాక్‌కు సహాయంగా అమెరికా తమ దళాలను పంపేందుకు అప్పట్లో ఒప్పందం కుదుర్చుకుంది. దాదాపు నాలుగేండ్ల తర్వాత ఈ తీర్మానం ఆ ఒప్పందానికి ముగింపు పలకనుంది. ఇదిలా ఉండగా, బాగ్దాద్‌లోని అంతర్జాతీయ విమానాశ్రయంపై అమెరికా బలగాలు క్షిపణి దాడికి పాల్పడటాన్ని ఇరాక్ ఆపద్ధర్మ ప్రధాని అబ్దెల్ అబ్దుల్ మహ్దీ సీరియస్‌గా తీసుకున్నారు. అమెరికా చర్యలు తమ సార్వభౌమత్వాన్ని దెబ్బతీశాయని విమర్శించారు. మున్ముందు కూడా అమెరికా ఇలాంటి చర్యలకు పాల్పడే అవకాశముందని అన్నారు. అందుకే, యూఎస్ బలగాలను శాశ్వతంగా తమ భూభాగం నుంచి పంపించాలని నిర్ణయించుకున్నామని అన్నారు.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్‌లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్‌కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







