ప్రధాని మోదీని కలిశాక మంచు లక్ష్మి చేసిన ట్వీట్
- January 06, 2020
న్యూఢిల్లీ: సినీ నటుడు మోహన్‌బాబు తన కుమార్తె మంచు లక్ష్మి, కుమారుడు మంచు విష్ణు, కోడలు విరోనికతో కలిసి ప్రధాని నరేంద్ర మోదీతో సోమవారం భేటీ అయ్యారు. ఈ భేటీతో ఆయన బీజేపీలో చేరనున్నారన్న ప్రచారం జోరందుకుంది. ప్రధాని నరేంద్ర మోదీ కూడా మోహన్‌బాబును బీజేపీలోకి ఆహ్వానించడంతో ఈ ప్రచారానికి బలం చేకూరింది. ప్రధానితో మోహన్‌బాబు దాదాపు అరగంటకు పైగా చర్చలు జరిపినట్లు తెలిసింది. మోదీతో భేటీ తర్వాత మంచు లక్ష్మి ఈ సమావేశానికి సంబంధించి ట్వీట్ చేసింది. ఇప్పుడే డైనమిక్ ప్రధాని మోదీని కలిశామని, మోదీ సారధ్యంలో భారత్ ఉన్నత శిఖరాలకు చేరుకుంటుందని మంచు లక్ష్మి ట్వీట్ చేసింది. ఇదిలా ఉంటే.. సాయంత్రం 6 గంటలకు కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో మోహన్‌బాబు భేటీ కానున్నట్లు సమాచారం. సోమవారం నెలకొన్న ఈ తాజా పరిణామాలతో మంచు కుటుంబం వైసీపీకి గుడ్‌బై చెప్పి బీజేపీలో చేరడం ఖాయంగా కనిపిస్తోంది.
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్‌లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?