ఏపీ స్థానిక ఎన్నికలకు హైకోర్టు అనుమతి
- January 08, 2020
అమరావతి:స్థానిక సంస్థల ఎన్నికల కార్యాచరణను రాష్ట్ర ఎన్నికల సంఘం బుధవారం హైకోర్టుకు అందజేసింది. మార్చి 3లోపు అన్ని స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తి చేస్తామని హైకోర్టుకు సమర్పించిన అఫిడవిట్లో ఎన్నికల సంఘం కార్యదర్శి పేర్కొన్నారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను జనవరి 17 నుంచి ఫిబ్రవరి 15 మధ్యలో పూర్తి చేస్తామని తెలిపారు. పంచాయతీ ఎన్నికలను ఫిబ్రవరి 8 నుంచి మార్చి 3 మధ్యలో నిర్వహిస్తామని వెల్లడించారు. జనవరి 10న ఎన్నికల సన్నాహాలపై జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తామని.. అదే రోజు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ, ఆర్థిక శాఖ, పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శులతో సమావేశం అవుతామన్నారు. జనవరి 13న రాజకీయ పార్టీలతో భేటీ కానున్నట్టు తెలిపారు. అఫిడవిట్‌ను పరిశీలించిన హైకోర్టు స్థానిక సంస్థల ఎన్నికలకు అనుమతి ఇచ్చింది.
ఈసీ అఫిడవిట్‌లోని అంశాలు :
జనవరి 17న ఎంపీపీ, జెడ్పీటీసీ ఎన్నికల నోటిఫికేషన్
ఫిబ్రవరి 15లో ఎంపీపీ, జెడ్పీటీసీ ఎన్నికలు పూర్తి
ఫిబ్రవరి 8న పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్
మార్చి 3లోగా పంచాయతీ ఎన్నికలు పూర్తి
జనవరి 10న ఉన్నతాధికారులతో ఈసీ సమావేశం
జనవరి 13న రాజకీయ పార్టీలతో ఈసీ భేటీ
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..
- ఏపీ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లిఖార్జునరావు
- గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సీటీ స్కాన్, సోలార్ పవర్ ప్రారంభం
- దుబాయ్‌లో వీసాల పేరుతో మోసాలు..నకిలీ ప్రకటనల పై పోలీసుల హెచ్చరిక
- ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాలను వణికిస్తున్న ‘H1N1′ వైరల్
- దుబాయ్‌లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో
- ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదినం సందర్భంగా UAE నేతల శుభాకాంక్షలు...
- రాయదుర్గంలో సుజ్లాన్ ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన







