ఇరాక్ లోని భారతీయులకు హెచ్చరిక..
- January 08, 2020
అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు తలెత్తిన నేపథ్యంలో ఇరాక్ లోని భారతీయులు అత్యవసరం కాని తమ ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని భారత్ కోరింది. అలాగే ఇరాక్ దేశానికి వెళ్లగోరే ఇండియన్స్ కూడా తమ ప్రయాణాల వాయిదాపై మరోసారి ఆలోచించాలని సూచించింది. ఇరాక్ లోని రెండు అమెరికన్ సైనిక స్థావరాలపై ఇరాన్ మిసైల్ దాడులతో ఉద్రిక్తత రేగగా.. ఇండియా ఈ ' ట్రావెల్ అడ్వైజరీని జారీ చేసింది. ఇరాక్ లో నివసిస్తున్న భారతీయులకు అన్ని సర్వీసులు అందజేసేందుకు బాగ్దాద్ లోని భారత రాయబార కార్యాలయం, అక్కడి ఎర్బిల్ లోని మన దౌత్య కార్యాలయం కూడా మామూలుగానే పని చేస్తున్నాయని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రవీష్ కుమార్ తెలిపారు. అటు-ఇండియాలోని అన్ని ఎయిర్ లైన్స్.. అప్రమత్తంగా ఉండాలని, ఇరాన్, ఇరాక్, ఒమన్, పర్షియన్ గల్ఫ్ దేశాల వైమానిక గగనతలాల విషయంలో ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని డీజీసీఏ కూడా సూచించింది. ఇరాక్ లో అనేకమంది భారతీయులు నిర్మాణ రంగాల్లో పని చేస్తున్న సంగతి విదితమే.
తాజా వార్తలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!







