50 ఏళ్ల పాటు UAEని రిప్రజెంట్ చేసే కొత్త లోగో రిలీజ్

- January 08, 2020 , by Maagulf
50 ఏళ్ల పాటు UAEని రిప్రజెంట్ చేసే కొత్త లోగో రిలీజ్

యూఏఈ బ్రాండ్ ఇమేజ్ చాటేల కొత్త లోగో రిలీజ్ అయ్యింది. దుబాయ్ వైస్ ప్రెసిడెంట్/ప్రైమ్ మినిస్టర్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్,  అబూ ధాబీ క్రౌన్ ప్రిన్స్ షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ కొత్త లోగోను ఆవిష్కరించారు. ఇప్పటి మరో 50 ఏళ్ల పాటు ఇదే లోగో యూఏఈని రిప్రజెంట్ చేయనుంది. కొత్త లోగోకు సంబంధించి  షేక్ మొహమ్మద్ తన ట్విట్టర్ అకౌంట్లో వీడియో పోస్ట్ చేశారు. ఎమిరాతి స్ఫూర్తి చాటేలా ఇక నుంచి అన్ని సంస్థలు, అన్ని సెక్టార్స్ లో లోగోను వినియోగించటం స్టార్ట్ చేయాలని పిలుపునిచ్చారు. 'ఈ రోజు నేను, సోదరుడు మొహమ్మద్ బిన్ జయాద్, 49 మంది ఎమిరాతి ఇన్నోవేటర్స్ కలిసి యూఏఈ ఐడెంటిని చాటేలా లోగోను విష్కరించాం. మన అభివృద్ధి లక్ష్యాలను సూచికగా నిలుస్తుంది. ప్రపంచ దేశాలతో ఏడు ఎమిరేట్స్ పోటీతత్వానికి స్ఫూర్తిగా నిలుస్తుంది' అని  షేక్ మొహమ్మద్ అన్నారు.

లోగో డిజైనింగ్ లో ఏడు ఎమిరేట్స్ నుంచి మొత్తం 49 ఎమిరాతి డిజైనర్స్ కలిసి మూడు లోగోలను రూపొందించారు. ఈ మూడు లోగోల నుంచి ఒక దాన్ని ఎంపిక చేసేందుకు ఆన్ లైన్ లో ఓటింగ్ నిర్వహించగా 10 మిలియన్ల ఓట్లు పోలయ్యాయి. వీరిలో మెజారిటీ ఓటర్ల ఎంపిక మేరకు మూడు లోగోల్లో ఒక లోగోను ఫైనల్ చేశారు. అయితే..ఓటింగ్ లో పాల్గొన్న 10 మిలియన్ల మందికి సూచికగా పది మిలియన్ల మొక్కలను నాటుతామని షేక్ మొహమ్మద్ తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com