మోస్ట్‌ డేంజరస్‌ టెర్రరిస్ట్‌ని అరెస్ట్‌ చేసిన సౌదీ అరేబియా

- January 08, 2020 , by Maagulf
మోస్ట్‌ డేంజరస్‌ టెర్రరిస్ట్‌ని అరెస్ట్‌ చేసిన సౌదీ అరేబియా

సౌదీ అరేబియా పోలీస్‌, ఈస్టర్న్‌ సిటీ కాతిఫ్‌లో ఓ టెర్రరిస్ట్‌ని అరెస్ట్‌ చేయడం జరిగింది. సెక్యూరిటీ పెట్రోల్‌ మీద సదరు వ్యక్తి కాల్పులు జరిపినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. నిందితుడ్ని మొహమ్మద్‌ హుస్సేన్‌ అలి అల్‌ అమ్మార్‌గా గుర్తించారు. అతన్ని మోస్ట్‌ వాంటెడ్‌ టెర్రరిస్ట్‌గా పేరొకన్నారు పోలీస్‌ అధికారులు. ఓ జడ్జిని కిడ్నాప్‌ చేసి హత్య చేసినట్లుగా నిందితుడిపై అభియోగాలున్నాయి. 2016లో జడ్జి షేక్‌ మొహమ్మద్‌ జిరానీని కిడ్నాప్‌ చేశారు. 2017లో షేక్‌ జిరానీ మృతి చెందినట్లు ధృవీకరించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com