ఇరాన్ క్రైసిస్ తో దుబాయ్ కి ముప్పేమి లేదు..విజిటర్లకు ప్రభుత్వం భరోసా
- January 09, 2020
ఇరాన్ క్రైసిస్ నేపథ్యంలో అంతర్జాతీయ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని దుబాయ్ ప్రభుత్వం కొట్టిపారేసింది. ఇరాన్- అమెరికా మధ్య ఉద్రిక్తతల నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల్లో దుబాయ్ విజిటింగ్ సేఫ్ కాదంటూ ఇంటర్నేషనల్ మీడియా చేస్తున్న హెచ్చరికలు అర్ధం లేనివని తేల్చి చెప్పింది. ఇరాన్ సంక్షోభం దుబాయ్ పై ఎలాంటి ప్రభావం చూపబోదని స్పష్టం చేసింది. విజిటర్స్ నిస్సంకోచంగా నిర్భయంగా దుబాయ్ లో పర్యటించొచ్చని క్లారిటీ ఇచ్చింది. అంతర్జాతీయ మీడియా ప్రచారం చేస్తున్నట్లుగా ఇరాన్ గవర్నమెంట్ నుంచి ఎలాంటి హెచ్చరికలు జారీ కాలేదని దుబాయ్ ప్రభుత్వం తెలిపింది. దుబాయ్ ని టార్గెట్ చేస్తూ మీడియా చేస్తున్న ప్రచారంపై మండిపడింది. కథనాలను ప్రసారం చేసే ముందు వాటిని నిర్ధారించుకొని వాస్తవాలను పబ్లిష్ చేయాలని సూచించింది.
తాజా వార్తలు
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!
- దుబాయ్‌లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..
- ఖతార్‌లో డ్రైవింగ్ స్కూళ్లకు కొత్త నిబంధనలు..!!
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం







