సియాచిన్‌లో సైనికులను కలిసిన ఆర్మీ చీఫ్
- January 09, 2020
ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నరవాణే ఇవాళ సియాచిన్‌లో పర్యటించారు. అక్కడ ఆయన సైనికులతో ముచ్చటించారు. వారికి న్యూ ఇయర్ గ్రీటింగ్స్ చెప్పారు. బాధ్యతలు చేపట్టిన వెంటనే ఇక్కడకు రావాలనుకున్నాను, కానీ వాతావరణం సరిగా లేని కారణంగా జనవరి మొదటి వారం పర్యటనను వాయిదా వేసినట్లు ఆయన తెలిపారు. అయినా సియాచిన్‌కు ఆర్మీ చీఫ్‌గా మొదటిసారి రావడం సంతోషంగా ఉందన్నారు. సియాచిన్‌లో విధులు నిర్వర్తించడం అంటే చాలా క్లిష్టమైన అంశమని, ఇక్కడ అన్నీ ప్రతికూల పరిస్థితులే ఉంటాయన్నారు. దుస్తులు, రేషన్‌తో పాటు అన్ని సదుపాయాలు కల్పించేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నట్లు ఆర్మీ చీఫ్ తెలిపారు.
తాజా వార్తలు
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్‌లో అస్సాం రైఫిల్స్‌పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!